సాహిత్యం, శాస్త్రం ఊపిరిగా చందు సుబ్బారావు: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్
 (1946 -2026)
...........................
అభ్యుదయ భావనలే 
అభివృద్ధికి సోపానాలని
సాహిత్యమే సమాజ దశా దిశా మార్చునని
అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శిగా
అనేక రచనలతో ప్రజలకు ప్రేరణ చేసి
భూ భౌతిక శాస్త్ర ఆచార్యునిగా
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో
ఎన్నో పరిశోధనలు చేసి
సుమారు ఇరవై ఐదు దేశాలలో పర్యటించి
భూగర్భ జలాలగురించి 
పరిశోధన పత్రాలను సమర్పించి
చలం స్త్రీ భావాలకు ఊతనిచ్చి
అనేక స్త్రీవాద, రాజకీయ వ్యాసాలను రచించి
'సైన్స్ అండ్ సివిలైజేషన్' అనే గ్రంథరచయితగా
'కవికి విమర్శకుడు శత్రువుకాదు' అనే గ్రంథంతో ప్రసిద్ధి చెంది
తాపీ ధర్మారావు,కొండేపూడి పురస్కారాలకే వన్నెతెచ్చి
ఎప్పుడు ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా పలకరించే అగ్రజులు
ఆచార్య చందుసుబ్బారావు  గారు
శాస్త్ర, సాహిత్యరంగాలే
ఊపిరిగా జీవితాంతం
గడిపి అందనిలోకాలకు చేరిన
మీకివే సమర్పిస్తున్న నా అక్షరనివాళి...!!
...........................


కామెంట్‌లు