నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని వెల్మల్ బొప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవం రోజున బాల చెలిమి గ్రంథాలయంను వెల్మల్ సర్పంచ్ రాచకొండ సాగర్ మరియు బొప్పారం సర్పంచ్ దేశెట్టి నరేష్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచకొండ సార్ మాట్లాడుతూ పుస్తకాలు మంచి మిత్రులతో సమానం ఇటువంటి ఉత్తమ పుస్తకాలు పంపించిన బాలచెలిమి సంపాదకులు మణికొండ వేద కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. బొప్పారం సర్పంచ్ దేశెట్టి నరేష్ మాట్లాడుతూ పిల్లలు రాసిన పుస్తకాలు పిల్లలు చదివినట్లయితే వారు నూతనోత్సహంతో చదువుతారని పిల్లల బాగుకొరకు బాల చెలిమి చేస్తున్న కృషిని అభినందించారు. ఈ మాస పత్రిక సంపాదకుడు మణికొండ వేద కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు నాలం విద్యాసాగర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఎంపిక చేసిన ఇరవై పాఠశాలలో మా పాఠశాల ఉండడం మాకు గర్వకారణమని ఈ సంవత్సరం ఆరువేయిల రెండువందల ముప్పై మూడు రూపాయల విలువ చేసే ఒక వంద యాభై పుస్తకాలను మొదటి విడతలో పంపించారని వీటిని పిల్లల చేత చదివించడానికి వారానికి ప్రతి తరగతికి ఒక పిరియడ్ కేటాయించి ఈ బాల చెలిమి పుస్తకాలను చదివిస్తామని చెప్పారు. గ్రంథాలయ ఇంచార్జ్ ఉపాధ్యాయులు కొండూరు పోతన్న మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులు రచించిన అంకురాలు 2 కథల సంపుటి ఉమ్మడి రాష్ట్రంలోని బాల సాహిత్యం కొరకు కృషి చేస్తున్న సాహితీవేత్తలకు చేరడం సంతోషదాయకమని మా విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించి ఉమ్మడి రాష్ట్రంలోని ఇరవై పాఠశాలలలో మా పాఠశాల ఉండడం మాకు సంతోషదాయకమని ఈ బాల చెలిమిలో పంపిన పుస్తకాలలో పిల్లలు రాసిన కథలు పుస్తకాలు మరియు పిల్లల కొరకు పెద్దలు రాసిన పుస్తకాల సంపుటాలను ఉన్నాయని ఈ పిల్లలు రాసిన పుస్తకాలు చదవడం వల్ల మా తోటి విద్యార్థులు కథలు రాస్తుంటే మేము కూడా రాయాలని జిజ్ఞాస పిల్లలలో ఏర్పడుతుందని తెలియజేశారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన బాలచలిమి జాతీయస్థాయి కథల పోటీల బహుమతి ప్రధానోత్సవం లో ఈ బాల చెలిమి గ్రంథాలయ పుస్తకాలను అందించారని తెలియజేస్తూ
బాలచలమి మాస పత్రిక సంపాదకులు మణికొండ వేద కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సరికెల గంగన్న సీనియర్ ఉపాధ్యాయులు కొప్పుల లక్ష్మణ్, నీల రమేష్, లింగారెడ్డి, రాజ మహేందర్, రమాదేవి, సౌజన్య, భారతి, కవిత వెల్మల్ బొప్పారం ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి