చదువు!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
గుణంతో ధనం సంపాదించలేం 
గణాంకాలతో ధనం సంపాదిస్తాం 
సంపద కన్నా గొప్ప సంపద ఆరోగ్యం 
దానంలోకెల్లా గొప్పదానం అన్నదానం!!

ధనం కన్నా గొప్పదనం విద్య ధనం 
దానాల కన్నా గొప్పదానం విద్యాదానం 
మనం చదివే చదువు ఖరీదైనది 
మన ఆరోగ్యం ఖరీదైనది 
మన గృహం ఖరీదైనది 
వీటితోనే మనం వ్యాపారం చేస్తున్నాం
ధనవంతులమవుతున్నాం!!!?

ఎంత వ్యాపారం చేసినా 
ప్రపంచం మొత్తంలో అతి చౌకైనది 
మనం తినే తిండి 
మనం కట్టే బట్ట 
మనం తొడిగే చెప్పులు 
అలాగే మనం చదివే చదువు వచ్చి చేరాలి .!!?

ఇది ప్రభుత్వ గొప్పతనం కాదు 
వ్యాపారస్తుల గొప్పతనం కాదు 
ప్రజల గొప్పతనం.!!

రండి 
ప్రపంచ పేద ప్రజలారా 
మా తిండి తినండి!!
మా బట్ట కట్టండి!!
మా చెప్పులు తొడగండి!
మా చదువు చదవండి!!!

నేడు అంతర్జాతీయ విద్యా దినోత్సవం.

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.

కామెంట్‌లు