సామెత -114- అయ్య తవ్విస్తే కొడుకు కూడ్పించినట్టు
****
"హవ్వ! హవ్వ! గాడు సన్న శిన్నోడు కాదే అవ్వా! మా కంత్రీ గాడు. గస్మంటోడు ఊల్లె ఒక్కడంటె ఒక్కడుంటే సాలు.ఇంగ గా వూరింక సత్తెనాసె.గానంత లఫంగి గాడు గీ సుట్టుపక్కల ఊళ్ళల్ల కాగడా పట్టి ఎత్కినా దొర్కడు. కలికమేసి సూసినా కన్బడడు.'
"ఏంది శెల్లె? గంతగనం గరం గరం గున్నవు? ఎవడాడు?ఎవల్ని తిట్టేది?ఏంజేశిండేంది?"
" ఏం జేసుడేందవ్వా! గాడు జేసిన పన్లు ఇంటె నువ్వు సుత 'థూ! శీ! అంటవు.గాడంత ఉక్కుష్టుడు ఇంకోడు లేడంటే నమ్ము.
ఇంతకీ ఎవడు శెల్లే! నీతో గిట్ల తిట్లు దింటుండంటే గానంత దుట్టుడు ఇంగోడు లేడనిపిత్తుంది.
అవునవ్వా! గాడే మన సుందరయ్య మావ కొడ్కు నాగరాజు. గా మావ కడ్పుల శెడబుట్టిండు. గాడే మనూర్కి శనొతికె దాపురిచ్చిండు.ఒక్కటంటె ఒక్కటి సుత ఆయిమన్న పన్లు జేయట్లే."
ఊల్లె బలాదూర్ తిర్గుడు.ఆడవిల్లల్ని శిడాయించుడు. అద్రిచ్చి బెద్రిచ్చి మందిని ముంచుడు.గాని రౌడీ శెకలకి పతొక్కలు బయవడుడే.ఎవ్వలు సుత దైర్నంగ గాని ఎదురు బడి అనేటోళ్ళే లేకుండయ్యిండ్రు.
"అవునే శెల్లె !సాటుంగ సుత గాని ముచ్చెటి శెప్పుకోవాలన్న అదురుబుచ్చుకుంటుండ్రు.గోడలకి శెవులంటయి అంటరు సూడు గట్ల బెదురుతుండ్రు. గాడిని తిట్టేయి ఎక్కడ యిన్పడి మీద కొత్తడో నని.
"అవునవ్వా ! గా సుందరయ్య మావ ఎంత మంచోడుండె. ఎవ్వలికి ఏ ఆపదొచ్చినా వచ్చి దైర్నం జెప్పి ఆదుకునేటోడు. పసోళ్ళ దగ్గర్నించి పండు ముసలోల్ల దనుక గా మావంటె పడిసచ్చెటోళ్ళు. శిన్నల శిన్న పెద్దల పెద్దోలె ఉండే గంత గొప్ప మడిషి కడ్పుల గీడెట్ల పుట్టిండో! పులి కడ్పున పులే పుడ్తది అంటరు గని గిక్కడ తార్ మార్ అయ్యిందవ్వా!"
"అవును శెల్లె! ఎండ కాలమొచ్చి ఊల్లె నీళ్ళు దొరక్క గిజగిజలాడ్తుంటే గా మావ పేద్ద బాయి సుత దొవ్విచ్చిండు. గాయ్న శేతి సల్వ.పుష్కలంగ నీళ్ళు బడ్డయి.కొబ్బరి నీళ్ళొతికె తియ్యంగున్నయవి. సీసల నీళ్ల జోలికి పోకుండా గవే తెచ్చుకుని తాగుతుంటిమి.
"గస్మంటి బాయికి జెనాలొచ్చి తన శేను శెల్క తొక్కిడి జేత్తుండ్రని రోజింత టాటర్ల మట్టి దెచ్చి పూడ బెట్టిండు.
గీ సైమంల మావుంటే గట్ల జరిగేది గాదు.గీని పాపపు పన్లు సూడొద్దని మావని దేవుడు ముందే దీస్క బోయిండు."
ఊల్లె జనాల అవసరాల కోసం " గా అయ్య తవ్విస్తే గీ పాపిట్టి కొడుకు కూడ్పించిండు.ఎన్ని తిట్టినా పాపం లేదు శెల్లె! గందుకే మన పెద్దోళ్ళ నోట్లె నుంచి గీ సామెత పుట్టుకొచ్చింది. "అయ్య తవ్విస్తే కొడుకు కూడ్పించినట్టు" అని.
"అవునా అవ్వా! మా బాగ జెప్పినవ్! యినాశ కాలంల గిస్మంటి ఇపరీత బుద్ధులే పుడ్తయో ఏమో?ఎప్పుడో గాడికి తగిన శాత్తి అయితది. గాని తప్పు గానికి తెల్సొత్తది!
గదండీ సంగతి."అయ్య తవ్విస్తే కొడుకు కూడ్పించినట్టు అంటే గిదే మరి!"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి