ఓ మనిషి మేలుకో....! :- కోరాడ నరసింహా రావు !
 సకల శ్రు ష్ఠి కీ ఆకాశమేతండ్రి...! 
భూగోళం.... ప్రాణి కోటికి తల్లి యైన గ్రహం...!! 
నిజానికి ఈ గ్రహము కంటే గొప్ప గ్రహం మరోటి లేదు 
ఇక్కడ ప్రాణి కోటికి అనుగుణ మైన వాతా వరణం, పరిస్థితులు ఉన్నాయి...! 
 అనాగరికం నుండి మనిషి నాగరికుడైననాటి నుండే..... 
  భౌ గోళిక స్థితి గతులకు ఇబ్బందులు మొదలైనాయి...! 
మనిషి తన అతిసుఖము, ఆనందముల కోసం.... 
 ఈ భూమితో పాటు మిగిలిన గ్రహాల నన్నిటినీ  అతలాకుతలం చేసేసాడు
ఇది నాది అది నీది అం టు స్వార్ధముతో హద్దుల నేర్పరిచేసాడు...! 
  అటు దురాశతోహద్దులు  దాటి ఆక్రమణలకు తెగ బడ్డాడు...., 
  యుద్దాలు చేస్తున్నాడు, మారణ హోమాలు శ్రుష్ఠిస్తున్నాడు...! 
 ఇటు...తీవ్ర కాలుష్యాలను నింపిభౌ గోళిక వాతా వరణ పరిస్థి తులను ఛిన్నాభిన్నం చే సేస్తున్నాడు...! 
ఈ భూమి సహజ సుంద రత్వాన్ని పూ ర్తి గా... 
  విక్రుతం చేసేసాడు...! 
తన తలకి తానే కొరివి పెట్టుకున్నానని తెలుసు కో లేక పోయాడు...!! 
ఆరడుగుల నేల తనకు సరిపోతుందని తెలిసి కూడా..., 
  ఈ సమస్త భూమిపై తన హక్కును ప్రకటించుకునేం దుకు.... తెగ తాపత్రయ పడి పో తున్నాడు....!! 
ఈ మహా కాల చక్రములో తన ఉనికి కేవలం అత్యల్పమే నని మరిచిపోతున్నాడు...! 
 
ఉన్న ఆకొద్ది సేపు సుఖం గా, సంతోష ముగా బ్రతకటం మాని , తాను దుః ఖి స్తు... ఇతరులను దుః ఖ పెడు తున్నాడు ! 
మనిషి మన జాతీయ భౌ గోళిక స్థితి గతులను పరి రక్షించు కుంటే తప్ప ఈ నెలపై ప్రాణి కోటికి మనుగడ లేదు...! 
   
ఓ మనిషి మేలుకో....! 
  నిన్ను నీ వు  రక్షించుకో!! 
    *****

కామెంట్‌లు