సంక్రాంతి : - మల్లావఝల చంద్రశేఖర శర్మనర్సాయపల్లి (పురోహితులు)టి.జి.టి గణితం ఆదర్శ పాఠశాల మద్దూరు
ముంగిళ్ళలోరంగు ముగ్గులందంబులో
నిలుచుగొబ్బెమ్మలోవెలుగులక్ష్మి
బోడపళ్ళనుబోయ బోసినవ్వులజూపు
పిల్లలమోములోవెలుగులక్ష్మి
బొమ్మలకొలువులోపొంగుపాలనుగాంచు
వేడ్కలోయింటింట వెలుగులక్ష్మి
అరిసెలుచకిణాలుకరియలప్పలతోడ
విందుభోజనమున వెలుగులక్ష్మి

భోగి సంక్రాంతి కనుమలయాగమనము
సంక్రమణవేళజేయగాసంబరములు
తెలుగులోగిళ్ళలో నిండ వెలుగులెన్నొ
అందజేతునందరికి నే సుందరమగు
కవితరూపంబులోశుభాకాంక్షలిచట


కామెంట్‌లు