కృష్ణ పరమాత్మ లీలలు: - - యామిజాల జగదీశ్
 శ్రీ కృష్ణుడి లీలలు, కథలను వినే కొద్దీ ఆనందం పరిమితి పెరుగుతుందే తప్ప తరగదు. విసుగెత్తదు. 
కానీ ఒక్క విషయం...
మనకు పని చేయడానికి, నిద్రించడానికి, మాట్లాడటానికి సమయం ఉంటుంది. అయితే దేవుని విషయాలను తెలుసుకోవడానికి సమయం ఉండదు. ఎందుకంటే కృష్ణపరమాత్మ సమయం, పరిమితులకు అతీతం!
సమయాన్ని చూడకుండానే శ్రీ కృష్ణుడి లీలలను వినవచ్చు. పగలు, వారాలు, నెలలకతీతంగా ఈ జీవితాంతం పరమాత్మ విన్యాసాలను వినవచ్చు. తరలించవచ్చు. ఆనందించవచ్చు.
శ్రీ కృష్ణుడి దివ్య నామాలను, ఆయన లీలలను తెలిసిన, అర్థం చేసుకున్న వ్యక్తికి... తదుపరి జన్మ లేదని గీత చెబుతోంది. 
కాబట్టి, ఈ ప్రస్తుత జీవితంలో, శ్రీ కృష్ణుడి లీలలన్నింటినీ తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం ఉత్తమం! అన్ని విధాలా శ్రేయస్కరం.

కామెంట్‌లు