డాక్టర్ పోతుకూచి సాంబశివరావు జయంతి మహోత్సవంలో "కావ్యసుధ"కు ఘన సన్మానం
 అఖిల భారతీయ భాష సాహిత్య సమ్మేళన్ హైదరాబాద్ మరియు విశ్వ సాహితీ సంయుక్తం ఆధ్వర్యంలో "కళా ప్రపూర్ణ" డాక్టర్ పోతుకూచి సాంబశివరావు 98వ  జయంతి మహోత్సవం మరియు కవి గాయక సమ్మేళనం మంగళవారం ఉదయం అశోక్ నగర్ సాంస్కృతిక కేంద్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
       సంస్థ ప్రధాన కార్యదర్శి రఘువీర్ ప్రతాప్ స్వాగతం పలుకగా, దీపారాధన అనంతరం సభకు ఆచార్య కడారి సత్యమూర్తి అధ్యక్షత వహిస్తూ భారతీయ భాష సాహిత్య సమ్మేళనం, విశ్వ సాహితీ  కార్యకలాపాలను గూర్చి తన తొలి పలుకులలో వివరించారు. 
ఆత్మీయ అతిథి నేటి నిజం సంపాదకులు బైసా దేవదాసు గారు మాట్లాడుతూ కవిత్వం అంటే మనిషిని మనిషిని కలిపేదేనని, కవిత్వం వ్రాయడం ఒక తపస్సుఅని, కవులకు కవిత్వ పోటీలు నిర్వహించి మూడు వేల రూపాయలు ఒక్కొక్కటిగా ముగ్గురికి బహుమతి ప్రధానం చేస్తానని హామీ ఇచ్చారు.
             ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర, భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ రాస్తే వచ్చేది కవిత్వం కాదు, వస్తే రాసేదే కవిత్వమని వక్కానించారు. డాక్టర్ పోతుకూచి సాంబశివరావు గారి రచనలపై సమగ్ర పరిశోధనా వ్యాసాలను ఆహ్వానించారు. నూతనంగా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు తీసుకున్న ఎన్వీ రఘువీర్ ప్రతాప్ ఆధ్వర్యంలో మున్ముందు అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ మరియు విశ్వసాహితి సభలన్నీ దిగ్విజంగా జరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్టార్,విశిష్ట అతిథి గా విచ్చేసిన ఆచార్య టి గౌరీ శంకర్ గారు డాక్టర్ పోతుకూచి  సాంబశివరావు గారితో మరియు ఆయన స్థాపించిన పై రెండు సంస్థలతో తనకున్న అనుబంధాన్ని సభికుతో పంచుకున్నారు. 
 శ్రీమతి గోళ్ళమూడి పద్మావతి, ఎన్వి రఘువీర్ ప్రతాప్ సమన్వయకర్తలుగా వ్యవహరించిన కవి సమ్మేళనంలో.....
నా కవితా రచనకు శ్రీకారం చుట్టింది విశ్వరచన సాంబశివుడే, నా కవిత్వానికి మార్గదర్శి సాంబశివుడేనని.. పౌరుషంగా బ్రతుకు అనే కవిత్వాన్ని వినిపించిన  ప్రముఖ కవి, ఆధ్యాత్మిక సాహితీవేత్త, "కావ్యసుధ"ను, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఆచార్య గౌరీ శంకర్,బైసాదేవదాసు గార్లు శాలువా సర్టిఫికెట్ తో  ఘనంగా సన్మానించారు.
 పెద్దూరి వెంకట దాసు, గజవెల్లి దశరథ రామయ్య,ఆచార్య సత్యమూర్తి, డాక్టర్ చంద్రశేఖర శర్మ, డాక్టర్ అరుణ, శ్రీమతి ఝాన్సీ ముడుంబై, బుక్కపట్నం రమాదేవి, కొత్త ప్రియాంక,జి పద్మావతి, పరిమి వెంకట సత్యమూర్తి గజ్జల రామకృష్ణ, సుందరవల్లి శ్రీదేవి, శ్రీమతి శోభా దేశ్ పాండే, పండాల  మహేశ్వర్, కవులు తమ కవిత్వముతో సభను రంజింప చేశారు,పాల్గొన్న కవులందరిని శాలువా సర్టిఫికెట్లతో సన్మానించారు, శ్రీమతి గోళ్ళమూడి పద్మావతి గారు వందన సమర్పణ చేశారు. కమ్మటి వింది భోజనంతో సభ ముగిసింది.

కామెంట్‌లు