చిట్టి చిలక పొట్టి బాబు : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
చిట్టి పొట్టి చిన్న బాబు 
చిన్న చిన్న అడుగులేస్తూ
చిట్ట చిట్ట నీవు వచ్చి 
చెట్టూ పుట్టను చూడు బాబు 

చెట్టు మీద చిట్టిచిలక 
దాని గట్టి ముక్కు తోటి 
దోరకాయ కొరుకుతుంది 
జర జర నీకు వేస్తుంది 

చెట్టుకిందున్న పుట్టలో 
చిన్నారి నాగుపాము 
పుట్ట మీదికి వచ్చి చూసి 
పడుగ తీసి ఆడుతుంది 

పాము పడుగ చూసి  
నీవు బీతి చెందకుండా 
పక్కకున్న బండ నెక్కి 
దొర పండు తిను బాబు 


కామెంట్‌లు