రాజ్యాంగమా!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
రాజ్యాంగాన్ని రాసిన 
అంబేద్కర్ 
అట్టడుగు నిమ్న బడుగు బలహీనవర్గాలకు 
చదువు కునేందుకు అవకాశం ఇచ్చాడు 
ఉద్యోగాలు ఇప్పించాడు. 

చదువు సంపదను సృష్టిస్తుందని 
ఉద్యోగాన్ని తెస్తుందని 
చదువు జ్ఞానాన్ని కూడా ఇస్తుందని 
అనుకున్నాడు. 

కానీ 
చదువులో ఇప్పుడు పోటీ తప్ప 
జ్ఞానము లేక ఉద్యోగము లేక 
చదువుకునేందుకు ఇక చదివెందుకని 
నిమ్న అట్టడుగు బడుగు బలహీన వర్గాలు 
బలంగా నమ్ముతున్నారు.!?

కొంతమంది 
ఫ్యాషన్ కోసం చదువుతున్నారు 
మరికొంతమంది 
జ్ఞానం కోసం చదువుతున్నారు 
కానీ అందరూ 
ఉద్యోగం కోసం మాత్రమే చదువుతున్నారు 
రాజ్యాంగమా వాళ్లను రక్షించు.!!!!?

రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు