మన లోకాలు! :- డా ప్రతాప్ కౌటిళ్యా
విడిచిపెట్టి పోలేనిది గాలి 
దాచిపెట్టలేని ధనం కాంతి 
తీర్చలేని రుణం చీకటి 
విత్తనాల సంతానం వనం 
పచ్చని ఆకుపచ్చదనం భూమి 
నీలాకాశం నింగి 
విశాల సముద్రం బంగాళాఖాతం 
ఎత్తైన శిఖరం హిమాలయ గోపురం 

జీవనది గంగా నది 
ఎదిగిన ఎడారి ఒదిగిన ఒయాసిస్సు
కురిసే వర్షం పారేనది 
పగిలిన మేగం ఎగిరిపోయిన వాన 
గుండె పగిలిన నెల బండ బారిన ఎండ 
విరగబోసిన తీగ రాలిపోయిన పూత 

వీచిన గాలి నేల వాలిన కాయ 
నిలబడ్డ చెట్టు ఊడిపడ్డ వేరు 
ఎగిరే పక్షి రక్షణ లేని ఆకాశం 
బంగారు పంట తుఫాను మంట 
పొంగిన నది మునిగిన నేల 

అందమైన బంధం నీరు మట్టిది 
అపూర్వ అనుబంధం నేలసముద్రానిది 
బావి నది సముద్రం చేపల ప్రపంచం 
నింగి నేల ఆకాశం మనిషి నివాసం 

ఎదిగినా అరణ్యం ఒదిగిన మైదానం 
సుడిగుండాలు గాలి నీరు గండాలు 
గతితప్పని ఋతువులు మతి తప్పని జీవులు 
చెట్టు ఆకలి తీర్చే ఎండా వాన 
మనిషి ఆకలి తీర్చే మాంసం పంట 
మన గృహం మన నేల మన గ్రహం భూమి!!

రంగురంగుల పూలు రంగురంగుల ధాన్యాలు 
రంగురంగుల కాయలు రంగురంగుల ఫలాలు 
మన పంటలు!
రంగురంగుల నక్షత్రాలు 
రంగురంగుల ఉరుములు మెరుపులు 
రంగురంగుల ఇంద్రధనస్సులు 
మన చూపులు!!

అందమైన సముద్రాలు 
అందమైన అరణ్యాలు 
అందమైన పర్వతాలు 
అందమైన ఎడారులు మన లోకాలు!!?
మన గృహం నేల మన గ్రహం భూమి.!!

డా ప్రతాప్ కౌటిళ్యా.
శ్రీ శ్రీ కళావేదిక జిల్లా సమన్వయకర్త.

కామెంట్‌లు