నేను
నా తలపై ఆకాశాన్ని మోస్తున్నానంటే
నమ్మకు
నేను భూగోళాన్ని మోస్తున్నానంటే నమ్ము!!
నేను
నా తలపై శరీరాన్ని మోస్తున్నానంటే
నమ్మకు
నేను నా తలను మోస్తున్నానంటే నమ్ము!!
చెట్టుకు నక్షత్రాలు కాస్తున్నాయంటే
నమ్మకు
చెట్టుకు పత్రాలు మొలుస్తున్నాయంటే నమ్ము!!
మంచు కురుస్తుందంటే నమ్మకు
వాన కురుస్తుందంటే నమ్ము!!!!!.
చీకటిని వెలుగు ఉరితీస్తుందంటే నమ్మకు
చీకటిని వెలుగు ఊపిరితీస్తుందంటే నమ్ము.!!
గాలి ఎగురుతుంది అంటే నమ్మకు
గాలి పంజరంలో ఉందంటే నమ్ము!!
నీటికి రంగు ఉందంటే నమ్మకు
నీటికి రూపముందంటే నమ్మకు
నీరు గడ్డ కడుతుందంటే నమ్ము
నీరు గాలిలా మారుతుంది అంటే నమ్ము!!
మనిషి భూతమంటే నమ్మకు
పంచభూతాలంటే నమ్ము .........!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి