ప్రముఖ బాల సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావుకు మరో గొప్ప పురస్కారం వరించింది .చిత్తూరు జిల్లా పలమనేరుకి చెందిన తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి మరియు పైనేని మునెమ్మ చారిటబుల్ ట్రస్ట్ ల తరపున “పైనేని మునమ్మ స్మారక పురస్కారాన్ని” నారంశెట్టి కి ప్రదానం చేయనున్నట్టు తెలిపారు .
ఈ నెల 25 ఆదివారం పలమనేరు లో నిర్వహించబోయే కార్యక్రమంలో పురస్కారం ప్రదానం చేయనున్నట్టు సంస్థ అధ్యక్షులు పి. తులసీనాథం నాయుడు నారంశెట్టికీ ఫోనులో తెలిపారు .
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలమనేరు శాసన సభ్యులు యన్. అమర్నాథ్ రెడ్డి, గౌరవ అతిథిగా శాసన మండలి విప్ డా ॥ కంచెర్ల శ్రీకాంత్ , డా. జి. వి. పూర్ణచంద్ , ఆత్మీయ అతిథులుగా ప్రముఖ రచయితలు పలమనేరు బాలాజీ , జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి తదితరులు హాజరవుతారని తెలిపారు .
అదే రోజు మరికొన్ని పురస్కారాలను వివిధ రంగాలలోని ప్రముఖులకు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు . బాలసాహిత్యంలో నారంశెట్టి చేసిన విశేష కృషికి ఈ పురస్కారం దక్కింది.
ఇంతవరకు 36 పుస్తకాలను నారంశెట్టి విడుదల చేయగా , 1500 కి పైగా రచనలు పత్రికల్లో ప్రచురించారు. వారి రచనలు ఆంగ్లం , కన్నడ భాషల్లోకి అనువాదం జరిగాయి. విభజిత తొలి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యునిగా పనిచేసారు నారంశెట్టి. వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఒకరు పరిశోదన చేసి డాక్టరేట్ పొందగా, మరో ముగ్గురు పరిశీలన చేసి ఎం. ఫిల్. పట్టా పొందారు. నారంశెట్టి బాలసాహిత్య పీఠం, ఉత్తరాంధ్ర రచయితల వేదిక అధ్యక్షులు గా నారంశెట్టి ఉన్నారు. వీరి సంస్థల ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలు , పురస్కారాల ప్రదానం చేసారు. నారంశెట్టికి పురస్కారం రావడం పట్ల పట్టణంలోని ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.
—-@@@——

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి