సామెత -104- అయ్యో అంటే ఆర్నెల్ల పాపం సుట్టుకున్నట్లు...
*****
"నువ్వేమన్నను అవ్వా! గివి మంచి దినాలు అస్సలే గావు.పిదప కాలం పిదప బుద్ధులు. మీసాలు మెలేసి మరీ మోసాలు చేత్తుండ్రు. ఎవుల్ని నమ్మాలో ఎవ్వల్ని నమ్మొద్దో తెల్వట్లే ."
"ఏంది కొండమ్మా? ఏం జర్గింది? గంతగనం ఇదై పోతున్నవు.గింతకీ ఎవలాళ్ళు?"
"ఎవలో ఐతే గింత బాదెందుకు పడ్త అవ్వా? గిది మాకే జర్గింది.గందుకే గింత బాద. ఇంట్లెకి సొచ్చుకొని వొచ్చిండు. పొలం శెల్కల కాడ పాలోళ్ళు మోసం జేసిండ్రని, కన్నమ్మ కట్టాలు బడ్తున్ననని, తిండికి బట్టకి సుత ఎల్లట్లేదని శెట్టంత మడిషి కండ్ల నీళ్ళు బెట్కొనే తల్కి మా ఆయన ఐసుడ్డొతికె కరిగిపోయిండు. ఎంటనే ఇంట్లె ఓ గదిల ఉండుమని జెప్పిండవ్వా!"
గక్కడితో ఆగితె బాగనే ఉండు.పేటలున్న మా ఆయన దోత్తు దవాఖానాకి తిర్గి తిర్గి ఆళ్ళ మందుల దుకణంల మందులు ఇచ్చేటాయన కింద పనికి కుదిర్చిండు. గాయ్న బొయ్యి పెళ్ళాం బిడ్డల్ని తెచ్చుకుండు."
ఇంట్లె నల్గురి తిండంటె మాటలా అన్కొని కూర,నార మేం ఏద్దిన్నా ఎక్వెక్కువ వొండుడు గిన్నెల బెట్టిచ్చుడు. గట్ల ఆళ్ళని సుట్టపోళ్ళ కంటే ఎక్వ సూసుకున్నం."
"గాళ్ళ పిల్లలు సల్లగుండవ్వా! తోక లేని కోతులే ఉన్నసోట ఉండుడు లేదు. గోడల్నిండా పిచ్చి గీతలు గీసుడు, తలుపులు దబ్బడ దిబ్బడ అటిటు గొట్టుడు. ఇంగొక్క మాట్ల శెప్పుతిను ఇల్లు పీకి పందిరేశిండ్రనుకో"
పిల్లలన్నంక కొందరు ఆటగోలు,అల్లరి జేసేటోళ్ళు ఉంటర్లే కొండమ్మా!"
"ఉంటరవ్వా గాళ్ళ అల్లర్కి అడ్డుకట్టేయాల్నా వొద్దా శెప్పు? ఇంటికొచ్చి ముచ్చెట్లు జెప్తుంటె గక్కడే పొల్లగాండ్లు నానా శికాకు జేత్తుంటె అయ్యనదు.కుయ్యనదు."
"కొండమ్మా! గివ్వన్నీ గట్టిగ జెప్పి,ఎచ్చరించాలె గద?"
గా సంబుడం సుత అయ్యిందవ్వా! ఆమె గద్దిచ్చటలేని ఓ పాలి నేనే గట్టిగా గద్దిచ్చిన.ఇంగ జూస్కో. మొఘమంత గంటు బెట్కుంట "పిల్లలన్నంక జెయ్యరా ఏంది?అని మూతి మూడొంకలు చాలు దిప్పుకుంట బోతే నాకు శానా శివుక్కుమన్నదవ్వా!.".
"ఎట్లన్న సరే గాళ్ళని వొదిలొచ్చుకో కొండమ్మా."
ఓ అవ్వోవ్!గంతట్తో ఆగితే బాగనే ఉండు.గీమేమో మొగుడు దెచ్చిన జీతంతో వొండుకొనుడు పొట్లెంగ తినుడు. గాయ్నేమో దవాఖాన్ల మందులు కొనేటోళ్ళతో సాటు మాటు యవ్వారాలు జేసి మందులు తప్పదీసి అమ్ముడు.గట్ల దుకణంల మందులాయెనకు లచ్చల్ల టోపీ బెట్టిండంట.
గద్దెల్సి మా ఆయన్నేను తెల్లబోయినం.దోత్తు పిల్సి గా డబ్బులు గాన్తో కట్టియ్యమని జెప్పే లోపే రాత్రికి రాత్రే పెండ్లాం పిల్లలను తీస్కొని పరారైండు.అయ్యో ! అని దయ దల్సినందుకు గిది మాకు దక్కింది. దోత్తు కాడ మాట బొయ్యింది. ఉత్త పున్నేనికి లచ్చల అప్పు గట్టాల్సి వొత్తుంది.కడ్పు శించుకుంటె కాళ్ళ మీద పడుతుందవ్వా!"
"ముక్కు జిర్రున శీదు కుంట కండ్లు కొంగుతో తుడ్సకుంట జెప్తున్న కొండమ్మ మీద మత్తు జాలనిపిచ్చి ఓదారుత్తూ...
అయ్యో!అంటే ఆర్నెల్ల పాపం సుట్టుకున్నట్టయ్యింది గద" అంటే ...
"అవునవ్వా !నువ్ళన్నట్టే జర్గింది.డబ్బు బోయింది. పర్వుబోయింది.గీ అప్పు తీర్సేతల్కి ఎన్నెళ్ళయిద్దో. ఇంగ పోతవ్వా? అన్కుంట కొండమ్మ ఎల్లిపోయింది.
గదండీ సంగతి. అయ్యో అంటే ఆర్నెల్ల పాపం సుట్టుకోడం"అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి