ఓ నా మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
కనుమ సంక్రాంతి
సందేశమిదే వినుమా...
బక్క చిక్కిన రైతు
దూక్కిదున్నకపోతే..?
నింగిలో నీలిమేఘం వాన
చినుకై నేలపై రాలకపోతే..?
ఎండైనా వానైనా ఎద్దులు
నేలను ముద్దాడక పోతే..?
రైతన్న నాగలి నవ్వకపోతే..?
పచ్చని పంటలు పుట్టకపోతే..!
ఆకలి మంటలతో
ఎందరు అలమటించే వారో
మల మల మాడి ఎందరు
మరణించే వారో ఎవరికెరుక..?
ఆ బ్రహ్మ అయినా
మన తల్లిదండ్రులైనా
ఒక్కసారి మనకు జన్మనిస్తారు
కానీ ప్రతిరోజూ ఆకలి తీర్చేది
రెయింబవళ్ళు రెక్కల్ ముక్కల్ చేసే ఆ
రైతన్నలే..! కడుపు కాలే ఆ అన్నదాతలే..!
అట్టి మట్టి కూలి రైతన్నే రాజు కావాలి...!
పొలమే ఆయనకు సామ్రాజ్యం కావాలి..!
తలపాగే ఆయనకు కీర్తి కిరీటం కావాలి..!
అందుకే అన్నదాతను మనం
కనిపించే దైవంగా" పూజించాలి
అన్నదాత తన పశువులను
దివినుండి దిగి వచ్చిన
"దేవతలుగా" గౌరవించాలి..!
కనుమనాడైనా కృతజ్ఞతా భావంతో
హారతిచ్చి మనసారా ఆరాధించాలి..!
పశువులను ప్రేమించే మనిషి
పశువులా ప్రవర్తించడు...
పశువాంఛతో రగిలిపోడు...
పరులకింత మేలుచేయ తపిస్తాడు..!
ఇదే ఈ నరులకు
కనుమ పండుగిచ్చే సంక్రాంతి సందేశం..!
ఇదే కనిపించే దైవానికి కృతజ్ఞతా గీతం.!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి