కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వారిచే అయ్యలసోమయాజుల ప్రసాద్ కు ఆత్మీయ సత్కారం.

 నడయాడే కాలభైరవ స్వరూపులు మంత్ర ద్రష్ట  పరమహంస పరివ్రాజక  శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి వారి తొంబది జన్మదిన సందర్భంగా విశాఖపట్నం లలితాపీఠంలో  ప్రముఖ కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ విశాఖపట్నం  సాహితీ వేత్త ఆచార్య దామెర వెంకట సూర్యారావు ఆధ్వర్యంలో నిర్వహించిన గురువిశిష్ఠత అనే  అంశంపై జరిగిన కవిసమ్మేళనం శ్రీ  శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద స్వామి వారు, శ్రీ శ్రీ శ్రీ దత్తేశ్వరానంద  భారతీస్వామి వారు  స్వామిని విమలానంద భారతీ  అమ్మ గారి సమక్షంలో  గురు విశిష్టత గురించి కవితాగానం చేయగా స్వామి వారు ఆశీర్వదిస్తు  పూలదండ, దుశ్శాలువ  కప్పి ఆత్మీయ సత్కారం చేసారు బదులుగా  మంత్రద్రష్ట,సాక్షాత్తు కాలభైరవ స్వరూపులైన స్వామి వారి సమక్షంలో  సరస్వతీ సభ లలితాదేవి అలయప్రాంగణంలో  నూతన సంవత్సరంలో స్వామి వారి జన్మదిన సందర్భంగా ఆశీస్సులతో సత్కారం పొందటం తన పూర్వజన్మ సుకృతం అని సంతోషం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు