పాలఖండ్యాంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

 పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అధ్యక్షతన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత దేశభక్తుల చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. దేశభక్తి గీతాలను విద్యార్థులు ఆలపించారు.  దేశభక్తుల వేషధారణలో హాజరైన విద్యార్థులను అందరూ అభినందించారు. అనంతరం జరిగిన సభలో ప్రధానోపాధ్యాయని ఆర్
ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యెందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు ప్రసంగించారు. ముఖ్య అతిథి సర్పంచ్ దారబోయిన రెయ్యమ్మ, గౌరవ అతిథి పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్ పర్సన్ చాంతాటి లక్ష్మి, విశిష్ట అతిథి పెద్ది సత్యనారాయణలు ప్రత్యేక ప్రసంగాలు గావించారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథుల, ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలబడి నిర్వాహకురాలు దారబోయిన జ్యోతి, విద్యా కమిటీ సభ్యులు బత్తుల రామలక్ష్మి అలజంగి అరుణ, గ్రామ పౌరులు డి.వెంకటరావు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు