ఓ మిత్రమా..!నా ప్రియ నేస్తమా..!ధైర్యంగా ఉండుగట్టిగా నిలువు...కానీ...క్రూరంగా కాదుమూర్ఖంగా కాదుమొండిగా అసలే కాదు...పిరికితనానికి బలైపోకు..!ఓ మిత్రమా..!నా ప్రియ నేస్తమా..!దయగలహృదయంతో ఉండుపేదలను ప్రేమించుఅనాధలను ఆదుకో...కానీ...బలహీనతలకు బానిసవైపోకు..!ఓ మిత్రమా..!నా ప్రియ నేస్తమా..!గౌరవాన్ని సంపాదించు...కానీ...అహంకారపు ముసుగులోపొగరుబోతుగా మారిపోకు..!ఓ మిత్రమా..!నా ప్రియ నేస్తమా..!రాముడిలా నీతిగా ఉండుధర్మాన్ని ఆచరించు...కానీ...రావణుడిలా అహంకారంతోరాక్షసుడిలా జీవ హింసతోరాబందులా దోచుకునే వాడివైపోకు..!
బలహీనతలకు బానిసకాకూ..!;- పోలయ్య కవి కూకట్లపల్లి-అత్తాపూర్, హైదరాబాద్
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి