ఎక్కడో పొడిచే పొద్దు
ఇంకెక్కడో విచ్చే పువ్వు
వెలుగుకు తోడై పరచుకునే
పరిమళాల ప్రకంపనలు
వేచి వేకువకై చూసి
కాచి వేసారిన మదిలో
తోచిన జిలిబిలి భావనల
పూచిన పువ్వుల వనం
ఆనందపు వెల్లువ మొదలై
ఆత్మీయత ఉప్పొంగి
అనురాగాల ఆలాపనలో
పల్లవించిన హృదయం
కనపడక బాధను దాచి
కనిపించే సంతోషం చూపి
కని పెంచుకున్న కలలకు
కనువిందుగ తోచే సత్యం
కొత్తగా వచ్చిన ఉదయంలో
కొల్లలుగా దొరికే ఆనందంతో
కోరిక తీరే క్షణాలు ఎన్నో
కదలి వద్దకు వచ్చే తరుణం
కన్నుల వెలుగే తోరణమై
మనసే పూల మంటపమై
చేతులు చాచిన ఆత్మీయతను
చేరగ వచ్చే చెలిమే భాగ్యం
శుభాకాంక్షలతో
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి