ఆంధ్రుల షెల్లీ.. దేవులపల్లి:- కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-విశాఖ పట్నం
ఆంధ్ర సాహితీ రంగాన భావకవిత్వపు మణిరత్నమై నిలిచెనను దేవులపల్లి.

ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై  అని ప్రకృతిలో మమేకమైన కవి.

తెలుగు భావ కవితారంగంలో అగ్రగణ్యుడై ఆంధ్రా షెల్లీగా పేరొందెను.

వైద్యం కోసం రైలులో వెళుతు ప్రకృతినిచూసి వ్రాసిన కృష్ణపక్షం చిరస్మరణీయం.

రవీంద్రనాథ్ ఠాగూర్ తో  సాన్నిహిత్యంతో అనేక రస రమ్య రచనలు చేసారు దేవులపల్లి.

హరిజనోద్ధరణ,వేశ్యా వివాహాల కొరకై అవిశ్రాంతంగా పోరాడిన సంఘ సంస్కర్త .

మల్లీశ్వరి సినిమా పాటలతో  సినీ సాహిత్యానికి  కావ్య గౌరవం చేసిన  మహాకవి.

జయ జయ జయ ప్రియభారతి జనయిత్రీ అనే గీతాన్ని కళాశాల విద్యార్థులకొరకు వ్రాసిన ఆదర్శ అధ్యాపకుడు.


నవ్విపోదురు గాక నాకేటి  సిగ్గు?
నా యిచ్చయే గాక నాకేటి వెరపు?  అన్న ధీశాలి దేవులపల్లి.

భార్యావియోగం తరువాత వ్రాసిన ఊర్వశి లో వేదనాభరిత ఆర్ద్రత వర్ణించలేనిది.

 కళా ప్రపూర్ణ, సాహిత్య అకాడమీ, పద్మభూషణ్ పురస్కారాలకే సాహిత్యంతో  వన్నెతెచ్చిన దేవులపల్లి ఆంధ్రా షెల్లీయే..!!
..........................


కామెంట్‌లు