అలజడి లేక అంతరంగాన
నిలబడిపోయెను నిబ్బరంగా
ఆటంకాలకు అలసిన మదిలో
అదిగో ఉదయపు బంగరు కాంతి!
మనసొక పవిత్ర సుక్షేత్రం
ఏది నాటితే అదే పెరుగును
ప్రేమైనా! పగైనా!
అనుమానమైనా! అనురాగమైనా!
మంచి చెడుల నిర్ణయంలో
ఉంచి విచక్షణను ఏమారక
ఎంచి మంచిని పెంచితే
ఎదురే లేని పయనమౌను!
చిన్ని తప్పులకు
పెద్ద మూల్యాలు
కొన్ని హృదయాలలో
ఎన్నో ఖేదాలు!
తగ్గిన తరగదు గౌరవం
నెగ్గిన పెరగదు మమకారం
కొద్దిగా సర్దుకుంటే
ముద్దుగా మారును జీవితం!
తలపులలోని తప్పులు
తగవులలోని గొప్పలు
తొలగిన మాయల తెరలు
తెలియును తరణికి సర్వం!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి