అది నీ ఇష్టం....! :-కోరాడ నరసింహా రావు.
 కొత్త కేలండర్తో ముస్తాబై వచ్చేసింది కాలం....! 
  ఈ సంవత్సరానికి సరిపడ,అందరి జాతకాలను ... 
  మోసుకొచ్చేసింది...!! 

తినబోతు... రుచుల కోసం
 ఎందుకా తహ తహ...! 
 ఆ రుచులు ఏవైన... 
  అనుభవించక తప్పదుగా

అది తీపైనా... చేదైనా... 
 అనుభవిం చాల్సిందే కదా !! 

నేటి నీ అనుభ వాలకు మూలం... 
  నిన్నటి నీ క్రియలే నోయ్
  రేపటి నీ అనుభవ ఫలాలకు... 
  నేటి నీ విత్తులే మూలం! 

ఇప్పుడే బాగా... ఆలో చించుకో... 
  రేపు నీ కెలాంటి ఫలాలు కావాలో...! 
  నీ ఇష్టం... 
 నువ్ చేదు విత్తులే నాటు తావో... 
  తీపి విత్తులే నాటు కుంటావో...!! 
    అది  నీ  ఇష్టం...! 
    ******

కామెంట్‌లు