అభిరుచులకు పదును పెడితే అద్భుతాలు సాధిస్తాం : కె . ప్రసాద్



 ప్రతి వ్యక్తిలో ఏదో ఒక  ప్రతిభ దాగి ఉంటుంది. అది తెలుసుకుని కృషి చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొందరు మాత్రం ముందు తరం నేతలు  అంటారు శ్రీ శ్రీ ఒక పాటలో . బాల్యం నుంచి ఉన్న అభిరుచికి పదును పెట్టి శ్రమిస్తే ఏదో ఒక రోజు అందరిలో ఒక ప్రత్యేకమైన గుంర్తింపు  పొందుతారు.మన సమాజం లో చాలా వరకు అరవై ఏళ్ళు నిండగానే ఇక నావల్ల ఏమీ కాదు. నేను ఎందుకు పనికి రాను అనే  భావనతో కాలం గడుపుతుంటారు. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని హైదరాబాద్ కు చెందినఏడు పదులు దాటిన  కంఠాయపాలెం ప్రసాద్ రుజువు చేస్తున్నారు. సుదీర్ఘ కాలం పాటు రైల్వే  ఇంజనీరింగ్ శాఖలో పని చేసి పదవీ విరమణ చేసిన తరువాత తన అభిరుచులకు  ప్రాధాన్యత ఇస్తూ రాణిస్తున్నారు. తనకు బాల్యం నుంచి హామర్ త్రో , షాట్ ఫుట్, డిస్క్ త్రో అంటే చాలా ఇష్టమని ఇప్పుడు తన ఖాళీ సమయం లో వీటిలో సాధన చేయడం ప్రారంభించారు .  శ్రమిస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మెదడుకు నిరంతరం పదును పెడుతుంటేనే  జ్ఞాపక శక్తి మెరుగవుతుంది అంటారు ప్రసాద్. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర , జాతీయ స్థాయిల్లో తాను  స్వర్ణ, రజిత, కాంస్య పతకాలు , ప్రశంసా పత్రాలు అందుకున్నట్టు చెప్పారు. ఇలాంటి వారే భావి తరాలకు మార్గ దర్శకులు. ఈ స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.భవిష్యత్తులో మరెన్నో పతకాలు కైవసం చేసుకోవాలని ఆకాంక్షిద్దాం . 


కామెంట్‌లు