ఒకప్పుడు బాల్యవివాహాలు, చిన్న ఆడపిల్లను ముసలితాతకిచ్చి పెళ్లిచేసేవారు.ఆపిల్ల యవ్వనంలోకి అడుగు పెట్టకముందే భర్త హరీఅంటే ఆమెకు శిరోముండనం గావించి వంటగత్తెగా పనిమనిషికన్నా హీనంగా చూసేవారు.దీనినే గురజాడ కన్యాశుల్కం పుత్తడిబొమ్మ పూర్ణమ్మ లో చూపారు.ఒక భక్తురాలు నిండా పాతికేళ్లు రాకుండానే వితంతువైంది. పిల్లజెల్లాలేరు.తిండి బట్టకి లోపంలేదు. ఆలయంలో పిల్లలకి పాటలు పద్యాలు చెప్తూ నీతికథలతో కాలం వెళ్లబుచ్చేది. భర్త పోగానే గలగల మ్రోగు గాజు గాజుల్ని ఎలాగో పగలగొడ్తారు ఆకాలంవారు.ఆమె వెంటనే చేతికి బంగారు మురుగులు చేయించుకుంది. కుళ్లుబోతు ఇరుగు పొరుగు ఆక్షేపించారు. " ఏమ్మా! భర్త ఉన్నప్పుడు మట్టిగాజులు,పసుపుతాడు వేసుకున్న నీవు ఇప్పుడు దర్జాగా బంగారు మురుగులు గొలుసుతో
కులుకుతున్నావా?" దానికామె చెప్పిన జవాబిది,"నాభర్త శరీరం గాజులాగా చిట్లి ముక్కలై మట్టిలో కలిసింది. ఆయన పరమాత్మ లో కల్సి ,శిధిలమైన స్థితి నుంచి పరమపదసోపానం చేరి భగవంతునిలో లీనమైనాడు.అందుకే బంగారం ధరిస్తున్నా.శాశ్వతం పవిత్రం,అవసరానికి ఆదుకునేది ఇవే.నేను చనిపోయాక ఆబంగారం అమ్మి అనాథబాలలకి పట్టెడన్నం పెట్టండి.గుడిలో ఇవ్వనవసరంలేదు.అనాధలు దీనులలోనే దైవం ఉంటాడు.బంధువులకివ్వటం దండగ.ఊడలాక్కుని వెళ్లగొడ్తారు.సినీనటి కాంచన ఉన్న దంతా బాలాజీకే అర్పించిన ధన్యురాలు. ఆమె కీర్తి శాశ్వతం.నటిగా రాగద్వేషాలు అనుభవించి వృద్ధాప్యంలో దైవ స్మరణ లో కాలంగడుపుతున్న ఆమె నాకు ఆదర్శం".అంతే ఒక్కరూ కిక్కురుమనలేదు🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి