తొడుగు…తొడుగు…
మన తెలుగు తల్లికి
రక్షణ కవచం తొడుగు…
కడుగు…కడుగు…
మన తెలుగు భాషకంటిన
పరభాషా కల్మషాన్ని కడుగు…
అడుగు…అడుగు…
మన గిడుగునడుగు…
“తెలుగంటే
"మీకెందుకింత ఆసక్తి…?”
“పరభాషలంటే
"మీకెందుకింత విరక్తి…?” అని…
అమ్మభాషా ప్రియుడు…
అమృతభాషకు గొడుగు…
పరభాషా వ్యామోహంపై
పడిన చిచ్చర పిడుగే గిడుగు...
ఆంధ్రభాషా పితామహుడు…
గ్రాంథికపు భాషాగర్వాన్ని
గంగలో కలిపిన ఘనుడు గిడుగు...
మన గిడుగు పలికే సత్యమొక్కటే…
భాష ప్రజలదైతేనే
భవిష్యత్తు భాషదౌతుంది...
భాష ఒక ఔషధమౌతుంది...
తెలుగు జాతికి...
భాష ఒక ఆయుధమౌతుంది...
మన గిడుగు ఇచ్చే సందేశమొక్కటే...
తెలుగు భాష...నా శ్వాస…
తెలుగు తల్లి....నా కన్నతల్లి…
ఆ తల్లి ఋణం తీర్చుకోవడానికే…
నా ఈ పోరాటమంతా…
నా ఈ ఆరాటమంతా…
నా ఈ తపనంతా…
నా ఈ తపస్సంతా…!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి