వికటకవి తెనాలి రామలింగడు: - కవి మిత్ర, సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.-(పుష్యమి)
 దేవీ అనుగ్రహము ఉంటే  పామరుడైన పండితుడు కాగలడన్నదానికి ప్రతీక రామలింగడు
కాళికాదేవి కటాక్షం పొంది చతురతతో పండితుడై కావ్యాలలో ప్రసిద్ధి చెందిన పాండురంగమహత్యం రచియించెను
అష్టదిగ్గజాలలో హాస్యానికి మారుపేరై  చతురతతో ఎన్నో సమస్యలను పరిష్కరించిన విజ్ఞుడు
రామకృష్ణుని చాటువులు నేటికి  సమాజాన సాధారణ ప్రజలకెంతో ప్రేరణ.
శ్రీలక్ష్మి నరసింహుని చరిత్ర  మూడు అశ్వాసాల  ఘటికాచల మహాత్స్యం   భక్తి రచనలు చేసెను.
తల్లిదండ్రులు పరదేవతా స్వరూపులని విచక్షణతో తెలుసుకున్న పాండురంగని చిత్రీకరణ న భూతో న భవిష్యతి.
తన వాక్పటిమ చతురత తో  వికటకవి గా ప్రసిద్ధి చెందిన మహాకవి తెనాలి రామలింగడు.
కందర్పకేతు విలాసం, హై లీలా విలాసం రామలింగడి అలభ్య రచనలు.
తాతాచార్యుల పై రామలింగడి హాస్యభాషణ కథలు నేటికి బాలసాహిత్యం లో కథలుగా ప్రసిద్ధి చెందినవి.
మేకతోకకు మేక తోక మేకకు మేక
మేకతోకకు తోక తోకమేక యను  పద్యంచే సభలో రాయలవారినే
ఆనందింప చేసిన హాస్యకవి...!!
...............................


కామెంట్‌లు