కస్తూరి పసుపు రాసితే గాయం మానుతుంది.
పత్తి వస్త్రం ధరిస్తే శరీరానికి కాస్త స్వస్థత చేకూరుతుంది.
కొండలు కూల్చే చేతులకు గుండెను ఆపితే కండలు గెలుస్తాయి అంతే.
మౌనంగా గాలిని మింగే మనిషికి కొండచిలువకు తేడా ఏమిటి.
పట్టుకున్న కొమ్మను వీడని పక్షి ఆకాశం సాక్షిగా మళ్లీ చెట్టుకొమ్మపై వాలుతుంది.
అర్థనగ్న నది వివస్త్ర అవుతుంటే స్మశానాన్ని ఎన్నుకున్నదీ.
పవిత్రమైన సంభాషణ ఆదిశేషుని భూషణమైంది
సముద్రాన్ని ఎదిరించిన చంద్రుడు ఇంద్రుడు కాలేకపోయినట్లు
ఎన్ని శ్వాసలు ఎన్ని విశ్వాసాలు నేలవాలుతున్నవి
అమృతాన్ని తాగిన మృత్యువు మళ్లీ మళ్లీ జన్మిస్తుంది.
ఎంత మొద్దు బారిన మొద్దయిన ఒక యుద్ధమే చేసి మళ్లీ చిగురిస్తుంది.
పొద్దును అద్దంగా మార్చిన ఆకాశం ఆ అద్దంలోనే జీవిస్తుంది.
ఒక అద్భుతం మేఘాన్ని కన్నా సముద్రం నదిని కనలేకపోయింది.
అడవిని సృష్టించిన చెట్టు చరిత్రను రచించలేకపోయింది
నేలకొరిగిన తల తెగిన కాగితం ఒక శేష గీతం.
రక్తం తయారు చేసే కర్మాగారం మనిషి శరీరం
రక్తంత్రాగే క్రూరమృగం మనిషి మనసు
ఎగిరిపొమ్మని ఎంత చెప్పినా ఎగురలేని
పక్షికి కావాల్సింది ఆకాశం కాదు ఆత్మవిశ్వాసం. ఇది ఒక శేష గీతం.
(శ్రీశైలం )సిల్వర్ జూబ్లీ తమ్ముడు -నాగశేషు- స్మృతిలో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి