రచయిత్రి డా. ధనాశి ఉషారాణి కి సౌత్ ఇండియన్ సావిత్రీ భాయి ఫూలే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారo

 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందినప్రముఖ రచయిత్రి నూతన ప్రక్రియల రూపకర్త సాహిత్య సామాజిక సేవా రంగాల్లో సేవ చేసినందుకుగాను  గురుచైతన్య ఉపాధ్యాయ సంఘము వారు సావిత్రీ భాయి పూలే జయంతి వేడుకలు సందర్భముగా విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో  జనవరి 3 తేదీన సావిత్రీ భాయి ఫూలే పురస్కారంను  అందుకున్నారు.  సాహిత్యంలో  అనేక పుస్తకాలు ముద్రించి  విభిన్న ప్రక్రియలుల్లో సాహిత్య సేవ చేస్తూ  కళాశాల స్థాయిలో పిల్లలులో సాహిత్యంలో  కథలు కవితలు రాస్తూ సెమినార్ మెడికల్ క్యాంప్లు   బాలికా చైతన్య కార్యక్రమాలు నిర్వహించి మార్గదర్శిగా నిలిచినoదుకు డా. ధనాశి ఉషారాణి సావిత్రీ భాయి పూలే పురస్కారంను అందుకున్నారు. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన  అనేక మందిలో ఒక్కరిగా తిరుపతి జిల్లా నుంచి డా. ధనాశి ఉషారాణి అవార్డును అందుకున్నారు.
కామెంట్‌లు