నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీమతి దూబగుంట శేషమ్మ గారు, దూ బగుంట శ్రీహరి గారు.నా స్వస్థలం నెల్లూరు జిల్లా దువ్వూరు గ్రామం. నేను పుట్టింది నెల్లూరులో జూబ్లీ హాస్పిటల్ లో. జూబ్లీ కాస్త అందరి నోళ్ళల్లో జీబులా స్పిటల్ అని మారిపోయింది.డాక్టర్ పేరు అప్పల నరసమ్మగారు.మాఅమ్మగారికిపిల్లలు పుట్టి పోవడం వల్ల చాలా రోజులు వారికి పిల్లలు లేరు. ఆంద్ర ప్రదేశ్ ఒంగోలు దగ్గర చందలూరు గ్రామంలోమహాలక్ష్మి అమ్మవారికి కొలిస్తే మా అక్క పుట్టింది. ఆమెకు మహాలక్ష్మిఅని పేరు పెట్టారు. తర్వాత రెండుఏండ్లకు నేను పుట్టాను. లక్ష్మీ అష్టకంలో వసుంధర... అన్నపదం విని మా అక్క నాకు నా పేరు ఖరారు చేసింది.పిల్లలు పుట్టిన సంతోషం చాలా రోజులు అనుభవించకుండానే నా ఐదవ ఏ ట మా అమ్మగారుపైలోకాలకు వెళ్లారు. నా చివరి పుట్టినరోజు బాగా గుర్తుంది. చాలా మంది పిల్లల్ని పిలిచి లడ్డు చేసి నా మెడలో పూలదండ వేసి చేయడం నాకు ఇంకా గుర్తుంది. నాకు చిన్నప్పుడు కథలంటే చాలా పిచ్చి.మా నాన్నను రోజు కథలు చెప్పమనేదాన్ని. ఎంత పెద్దకదచెప్పినా కథ ముగియగానే మళ్ళీకథచెప్పు అనేదాన్ని.మానాన్న ఒకథ ప్రారంభించాడు. ధాన్యం కొట్టులో చాలా ధాన్యం ఉన్నాయి రేణు పిచ్చుకలు అది చూచి గుట్టుగా కొట్టులో దూరి ఒక్కొక్క ఒడ్ల గింజ తినడం మొదలుపెట్టాయి.అని ఒక్కొకటి.. అంటూరెందురోజులు చెప్పాడు.నాకు విసుగొచ్చి అతర్వాత అన్నాను మా నాన్న "ఒడ్లు తినడం ఐపోనీతర్వాత చెప్తాను".అన్నాడు. అంతే.కథలుముగిసాయి.మాకాలంలో కూచిపూడి భాగవతులవారు గ్రామాలకువచ్చీకొన్ని రోజులుండి పండగలలో అర్ధనారీశ్వరుడు, సత్యభామ, మొదలైన వేషాలు ధరించి ఇండ్లకు వచ్చి ప్రదర్శించేవారు.చివరిరోజు బహుమానాలు పుచ్చుకొనేవారు. పిల్లలకు అది పెద్ద పండగ. వాళ్ళతో కూడా మేము తిరిగేవాళ్లాం.అలాగే యానాదులు అనేవారునల్లతంబి, రామాయణం మొదలైన వీధి నాటకాలు వేస్తేమా పెద్దలు మేము లాంతరుమరచెంబు (నీళ్లు)చాప తీసుకొని వెళ్లి చూచేవాళ్ళం.రాజు వెడలె రవితేజములలరగ..అంటూ చాలా ఉత్సాహంగా ఉండేది.నా స్నేహితులతో ఆ నాటకాలు మేం వేసేవాళ్ళం తర్వాత. అవొక రోజులు.
నేను మా ఆక్కనాన్నవద్ద భాగవతం భారతం లోని పద్యాలు కంఠస్థం చేశాము. హార్మోనియం నేను బాగా వాయించే దాన్ని డబుల్ రీడ్స్ లో.మా అక్కకుచాలా బాగుంది గొంతు బాగా పాడేది.5వ క్లాస్ వరకే అప్పటినాచదువు.చదువుకోవాలన్న నాకోర్కే మావారు తీర్చారు.మావారిపేరు డా. సి. వి. రామచంద్ర రావు గారు సుప్రసిద్ధ. చరిత్రకారులు. 40దాకావిలువైన గ్రంథ రచనలు చేశారు.నేను
పెళ్లి తర్వాతప్రైవేట్ గా p u c తో మొదలెట్టిP hd తో ముగించాను. రచనలు ఉపన్యాసాలు, తెలుగు లెక్చరర్ గా ఉద్యోగ నిర్వహణ నా జీవితంలో నాకు ఆనుకోని వరాలు.మా నాన్నగారు రెండవ వివాహం చేసుకున్నారు ఆమె చాలా మంచిది. నాకు నలుగురు చెల్లెళ్ళు నలుగురు తమ్ముళ్ళు. అందరు నన్ను మా అక్కను ఎంతో ప్రేమగా చూస్తారు.నన్ను,మా అక్కను దైవంగా భావిస్తారు మేమంతా ఎంతో అనుకూలంగా,ప్రేమగా ఉంటాము అది నా అదృష్టం. అత్తవారింట్లో,అమ్మగారింట్లో నాకు ఆదరణకు కొదువలేదు. నా బాల్యపు జ్ఞాపకాలుచెప్పుకొనే అవకాశం కల్పించిన నా సాహిత్య సోదరి శ్రీమతిఅచ్యుతుని రాజ్యశ్రీ కి వే వేల ఆశీస్సులు.ధన్యవాదాలు.
డా. సి వసుంధర,నెల్లూరు (ప్రస్తుతం చెన్నై)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి