సముద్ర గుప్తుడు12 : - అచ్యుతునిరాజ్యశ్రీ

 హరిషేణుడు చెప్పుకుపోతున్నాడు" ప్రభూ! మనం మధ్య భారతాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి.నాగవంశంలోని ఎన్నో శాఖలు చుట్టుపక్కల రాజ్యాల్లో వ్యాపించాయి.వర్మన్ అనే శాఖ మనరాజ్యంసమీపంలో ఉంది.చంద్ర వర్మన్,బలవర్మన్ రుద్రదేవుల్ని మనమార్గంలోంచి తొలగించాలి. ""బాణాలువేసే సమర్ధలైనవారు కావాలిప్రభూ! వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.కత్తితో గొడ్డలితో దాడిచేసేలా తర్ఫీదు ఇవ్వాలి." పృధ్వీషేణుడన్నాడు."రుద్రదేవునిపై దాడిచేద్దాం" సముద్రగుప్తుని మాటల్తో అంతా సై అన్నారు.రుద్రదేవుని అగ్గగ్గలాడించిన సముద్ర గుప్తునికి గాయాలు అవటంతో రాజవైద్యుడు సుశ్రుతుడు చికిత్స చేశాడు చకచకా!వారంతర్వాత సముద్ర గుప్తుడు తమను పిల్పించటంతో పృథ్వీ,హరి వచ్చారు.భర్త కి వింజామర వీస్తోంది శ్రీదత్త.గాయాలు మానుతున్నాయి. సుశ్రుతుడు రోజూ అశ్వగంధ కాకోలీ మైదా మొదలైన వాటితో లేపనం తయారుచేసి రాజుకి పట్టిస్తున్నాడు. రాజుని పరామర్శించటానికి వంటవాళ్లు,క్షురకులు పాత్రలు తోమేవారితో సహా వచ్చారు.ప్రభువనేవాడు పనివారితో సహా అందరితో స్నేహంగా ప్రేమగా మెలిగితీరాలి. "నాన్నా!ఎలా ఉన్నారు?" అంటూ 9ఏళ్ల చిన్నారి చంద్ర గుప్తుడొచ్చిపరుగున లేగదూడ లాగా తండ్రిశయ్యపై ఎక్కాడు."బాబూ! నాఒళ్లో కూచో! నాన్న ఇంకా కోలుకోవాలి" అని తన ఒళ్లోకూచోబెట్టుకుంది శ్రీదత్త." నాన్నా! అన్న నాతో ఆడటంలేదు. ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు.నాతో బాణాలాట ఆడడు. " ముద్దుగా బుంగమూతి పెట్టాడు.సముద్ర గుప్తుని రెండో భార్య చంద్రావతి కొడుకు రామగుప్తుడు🌹
కామెంట్‌లు