సముద్ర గుప్తుడు13 అచ్యుతునిరాజ్యశ్రీ

 "వచ్చే సంవత్సరం నీవుకూడా గురుకులానికి వెళ్లాలి నాయనా!" వాడిబుగ్గలు నిమురుతూ అన్నాడు .కాసేపు అమ్మ నాన్నల తో గడిపి" నేను ఐదుబాణాలు తయారుచేసికోవాలి." అని తుర్రుమన్నాడు ఆచిన్నవాడు."రాణీ! పిల్లల ముద్దుమాటలు గుండెతలుపులు తడ్తాయి. కానీ రామగుప్తుని గూర్చే నాబాధ".ఇంతలో హరిషేణుడు,కోశాధికారిగా,సచివునితో వచ్చి" ప్రభూ! మేము రూపొందించిన బంగారునాణెం.మీరు ఆమోదముద్ర వేస్తే చాలు" అంటూ రాజుచేతిలో పెట్టాడు. ఓవైపు సింహవాహనదుర్గామాతచిత్రం,రెండోవైపు మహారాజు చంద్రగుప్తుడు రాణికుమారదేవి చిత్రం ఉన్నాయి."ఇది మీచిత్రం ఉన్న నాణెంప్రభూ!"
ఒకనాణెంపై సముద్ర గుప్తుడు పులిని వేటాడుతున్నచిత్రం,రెండో నాణెంపై తన చెవిదాకా అల్లెత్రాడుని లాగుతున్న చిత్రం!"ఈపులివేట చిత్రాన్ని నాణెంపై ముద్రించండి" అన్న రాజుమాటలకి" ప్రభూ! దీనార్ అనేపేరుతో నాణేల్ని విడుదల చేస్తే విదేశాలతో వర్తక వ్యాపారాలకిఅనువుగా ఉంటుంది.వారుకూడా దీనార్ అనే నాణాన్ని వాడ్తారు.సింహళద్వీప రాజు మేఘవర్ణుడు బౌద్ధ విహారం ఏర్పాటుకు రాజు అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు."సింహళం సదా సముద్ర గుప్తరాజుకి ఋణపడిఉంటుంది ప్రభూ!""ప్రభూ! మీరాజనీతి యుక్తి నభూతో నభవిష్యతి"" మన గుప్తవంశ వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందాలంటే, ముఖ్యంగా సముద్ర వ్యాపారానికి ఈ సింహళం తొలిమెట్టు సుమా!""చాలా దూరం ఆలోచిస్తారు మీరు ప్రభూ!"
ఉత్తర ఆర్యావర్తంలోఉన్న చిన్న రాజ్యం మాతిల్"మేము నీకు చచ్చినా నీకు లొంగం" అనిరాజుకి సవాల్ విసిరాడు. "మేము సామంతులంగా బ్రతుకం".మంత్రిమండలిలో మాతిల్ తలబిరుసుతనంని గూర్చిన చర్చ జరుపుతున్నప్పుడు "ప్రభూ! మాతిల్ బుల్లిరాజ్యం తనబతుకు తాను బతికే దానిపై దండెత్తటం భావ్యం కాదేమో!?" ఒకవర్గం అంటే రెండోవర్గం ఇలా అంది"మన అస్థిత్వం శక్తి యుక్తులు చూపి మాతిల్ పొగరణచాలి"🌹
కామెంట్‌లు