హరిషేణుడు వారిని శాంతపరుస్తూ ఇలా అన్నాడు" మౌర్యసామ్రాజ్యనిర్మాత చాణుక్యుని ప్రకారం తన రాజ్యాన్ని దృఢ పర్చటమే రాజుయొక్క ప్రథమ కర్తవ్యం.అనేక బుల్లిబుల్లి చిట్టిపొట్టి రాజ్యాల్ని కలుపుకుని గుప్త సామ్రాజ్యంని విస్తరణ తో పాటు దృఢంగా నిలపాలి.చంద్ర గుప్త మౌర్యుడు చేసిన తొలి మహత్తర కార్యం ఇదే!మనం కూడా మాతిల్ రాజ్యపొగరుని అణిచితీరాలి. ఇంకో రాజ్యం కూడా ఇలా తలతిక్కగా ప్రవర్తించుట జరుగుతుంది." అంతే ఎవరూ కిక్కురుమనలేదు.రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా? సముద్ర గుప్తుడు మాతిలరాజు ముట్టెపొగరు అణచి చంపి,ప్రజల్ని తన మమతానురాగాల్తో లోబర్చుకున్నాడు."మహామంత్రీ! మీరనుకున్నట్లు ఆర్యావర్తంపై మన ఆధిపత్యం ఏర్పడింది.ఆపై...?""ప్రభూ! ఇల్లలుకగానే పండగకాదు.ఇరావతీనది(రావీనది)పైనున్న పెద్ద రాజ్యం లవపురం.నాగవంశానికి చెందిన రెండు రాజ్యాలు వంగదేశంలో ఉన్నాయి.వాటిపై మనతడాఖా చూపాలి." కంచుకంఠంతో అన్నాడు హరి."ఒకప్పుడవి సామ్రాట్ అశోకుడు,చంద్ర గుప్తుని ఆధీనంలో ఉండేవి."హరీ! మనంకూడా అశ్వమేథయాగం చేద్దామా?" " తప్పక ప్రభూ!"🌹
సముద్ర గుప్తుడు14 అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి