పూరీ జగన్నాథ ఆలయ విశిష్టతలు
ఒడిశా రాష్ట్రంలోని తీర ప్రాంత నగరం పూరీలో వెలసిన జగన్నాథ ఆలయం హిందువుల అత్యంత పవిత్రమైన చార్ ధామ్ క్షేత్రాలలో ఒకటి. 12వ శతాబ్దంలో కళింగ రాజు అనంతవర్మ చోడగంగదేవ్ ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా, అనంగభీమదేవ్ దీనిని పూర్తి చేశారు. ఈ క్షేత్రం కేవలం భక్తికి మాత్రమే కాక, సైన్స్‌కు కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలకు నిలయంగా ఉంది. ఈ ఆలయ ప్రాంగణం సుమారు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఆలయ ప్రధాన గోపురం ఎత్తు సుమారు 214 అడుగులు ఉంటుంది. నిర్మాణ శైలిలో కళింగ వాస్తు కళా నైపుణ్యం అడుగడుగునా కనిపిస్తుంది.
ఈ ఆలయంలో జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి కొలువై ఉంటాడు. సాధారణంగా హిందూ దేవాలయాల్లో విగ్రహాలు రాయి లేదా లోహంతో తయారు చేస్తారు. కానీ ఇక్కడ విగ్రహాలను 'దారువు' అనబడే వేప చెక్కతో రూపొందించడం ఒక ప్రత్యేకత. ప్రతి 12 లేదా 19 ఏళ్లకు ఒకసారి 'నవకళేబర' ఉత్సవం ద్వారా పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రక్రియలో పాత విగ్రహాలలోని 'బ్రహ్మ పదార్థాన్ని' తీసి కొత్త విగ్రహాలలో ఉంచుతారు. ఈ సమయంలో పూరీ నగరం అంతటా విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు.
ఆలయ నిర్మాణంలో కనిపించే కొన్ని వింతలు నేటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఆలయ శిఖరంపై ఉన్న జెండా ఎగరడం ఇక్కడ కనిపించే ప్రధాన అద్భుతం. సాధారణంగా గాలి ఏ దిశలో వీస్తుంటే జెండా ఆ దిశలో ఎగరాలి, కానీ ఇక్కడ మాత్రం ప్రకృతి నియమాలకు భిన్నంగా జరుగుతుంది. అలాగే ఆలయ ప్రధాన గోపురం నీడ పగలు ఏ సమయంలోనూ భూమిపై పడకపోవడం ఆనాటి శిల్పుల గణిత శాస్త్ర పరిజ్ఞానానికి నిదర్శనం. సముద్ర తీరానికి అతి సమీపంలో ఉన్నప్పటికీ, ఆలయ సింహద్వారం దాటి లోపలికి వెళ్లగానే సముద్రపు అలల శబ్దం అస్సలు వినిపించదు. తిరిగి బయటకు రాగానే ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. సముద్రం నుండి వీచే గాలులు పగటిపూట భూమి నుండి సముద్రం వైపు, రాత్రిపూట సముద్రం నుండి భూమి వైపు వీయడం ఇక్కడి మరో భౌగోళిక వింత.
ఆలయ శిఖరంపై ఒక టన్ను బరువున్న అష్టధాతువులతో చేసిన 'నీలచక్రం' ఉంటుంది. పూరీ నగరంలో ఏ మూల నుండి చూసినా ఈ చక్రం మన వైపు చూస్తున్నట్లే కనిపిస్తుంది. ఇంత బరువున్న చక్రాన్ని ఆ కాలంలో అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారో ఇప్పటికీ ఒక రహస్యమే. మరో విశేషమేమిటంటే, ఈ ఆలయ గోపురం పైభాగాన ఎప్పుడూ ఏ పక్షి కూడా వాలదు లేదా ఎగరదు. విమానాలు కూడా ఈ ఆలయం మీదుగా వెళ్లవు. దీనిని ప్రకృతి సిద్ధమైన నో ఫ్లై జోన్‌గా భక్తులు భావిస్తారు.
ఇక్కడి వంటశాల ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ప్రసాదాన్ని వండటానికి ఏడు మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి ఉంచి, కట్టెల పొయ్యి మీద కింద మంట పెడతారు. ఆశ్చర్యకరంగా అన్నింటికంటే పైన ఉన్న ఏడవ పాత్రలోని ఆహారం మొదట ఉడుకుతుంది, ఆ తర్వాతే కింద ఉన్న పాత్రల లోని ఆహారం ఉడుకుతుంది. ఈ ఆలయంలో వండే ప్రసాదం ఎంతమంది భక్తులు వచ్చినా సరిపోతుంది, ఎప్పుడూ తక్కువ కాదు అలాగని మిగిలిపోయి వృథా కాదు. ఏటా జరిగే రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. ఈ రథాలను ప్రతి ఏటా కొత్తగా నిర్మిస్తారు. ఇలాంటి అనేక విశిష్టతలతో పూరీ జగన్నాథ క్షేత్రం ఆధ్యాత్మికంగానూ, వైజ్ఞానికంగానూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి