సముద్రగుప్తుడు15:- అచ్యుతునిరాజ్యశ్రీ

 ఆర్యావర్తం అంతా ఇప్పుడుసముద్రగుప్తుని గుప్పిట్లో ఉంది.సనాతన ధర్మంపై నడిచేరాజు సుక్షత్రియుడు. బౌద్ధంపై అభిమానం చూపుతున్నాడు. మంచిబాటలు వేయించాడు. ధర్మ సత్రాలు అన్ని చోట్ల కట్టించాడు.ఉత్తర భారత మంతా ఒకే పన్నులవిధానంతో సుస్థిరంగా ఉంది.మంచిచురుకైన గూఢచారుల్ని నియమించి ఎప్పటివార్తలు అప్పుడు సేకరిస్తూ రాజ్యాన్ని వేయికళ్లతో కాపలాకాస్తున్నాడు హరిషేణుడు.గురుకులాలసంఖ్యని పెంచాడు.సంగీత నృత్యాది లలిత కళలుబాగా పుంజుకున్నాయి.పృథ్వీషేణుడు సైన్యంబాగోగుల్ని డేగ కళ్లతో  పర్యవేక్షిస్తున్నాడు. కొత్త గా 40వేలమంది సైన్యంలో చేరారు.వారికి కత్తి,బాణం,బల్లాల్ని ఉపయోగించటంలో శిక్షణ ఇస్తున్నాడు. సముద్ర గుప్తుడు తరచూ సైనిక కవాతుల్ని పరిశీలించేవాడు. రోజులు ప్రశాంతంగా దొర్లిపోతున్నాయి. కొడుకులిద్దరూ గ్రీష్మ శిశిర ఋతువుల్లో తల్లిదండ్రుల దగ్గర రెండునెలలు గడిపేవారు. ఆపై గురుకులంలోనే రామగుప్తుడు,చిన్నారి చంద్రగుప్తుడు కఠిన క్రమశిక్షణ, విద్యాభ్యాసంలో మునిగిపోయేవారు.ఒకరోజు సముద్రగుప్తుడు దర్బారులో కొలువుతీరి ఉండగా ,హఠాత్తుగా చిన్న కలవరం మొదలైంది.వదులు వదులు సల్వార్, పొడవాటి అంగరఖా, నెత్తిన ఉన్నిటోపీతో  భుజాన కంబళీవేసుకుని15మంది సభలోకి అడుగుపెట్టారు. వారిసర్దారు పెద్ద గడ్డంతో ఉన్నవాడు తలొంచి ఇలా అన్నాడు""జయము జయము మహారాజుకి!ఉత్తరానుండే  యౌధేయజాతివారంమేము. మీరు మాప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది.ఇంద్రప్రస్థానికి కొంచెందూరంలో ఉత్తర దిశలో సప్తసింధుదగ్గర ఐదునదులున్న సుక్షేత్రం మాది.మీరు పురుషపురందాకా వస్తారని తెలిసింది.మేము శాంతిప్రియులం. మీతోగెలవలేము.మీ ఆధిపత్యాన్ని త్రికరణశుద్ధి గా అంగీకరిస్తాం అని చెప్పటానికే  వచ్చాం". రాజు మహామంత్రివైపు సాభిప్రాయంగా చూశాడు.హరిషేణుడన్నాడు" కొంచెం ఆలోచించి మాఅభిప్రాయం తెల్పుతాం.మీరంతా మా అతిథిగృహంలో బసచేయొచ్చు""చిత్తం" వారు సెలవుతీసుకుని నగర సందర్శనానికెళ్లారు🌹
కామెంట్‌లు