అంతర్జాతీయ తెలుగు బాషా సమావేశo
"తెలుఁగ దేలయన్న దేశంబు తెలుఁగేను
తెలుఁగు వల్లభుండ తెలుఁగొ కండ
ఎల్ల నృపులుఁగొలువ యెఱుఁగ వే బాసాడి
దేశభాషలందు తెలుఁగు లెస్స.
అని సుమారు రెండు వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందు తున్న భాషల్లో ఒకటిగా " ఇటలి యన్ ఆఫ్ ది ఈస్ట్ " గా కిర్తికెక్కిన మన తెలుగు చాలా గొప్పది అనికర్ణాతాధీశుడైన న శ్రీకృష్ణ దేవరాయలు కూడా తెలుగు భా షాభి మానాన్నే ప్రకటించాడు.
56 అక్షరాలతో, నుడికారాలతో, చందస్సు, జాతీయాలు కలిగిన బాష తెలుగు బాష నన్నయ్య, తిక్కన, పోతన వంటి మహాను బావుల కావ్యాలతో, వేమన పద్యలతో వెలసిల్లింది.
సాహిత్య సభలలో సంస్కృతం తరువాత, తెలుగులోనే ప్రదర్శించే అద్భుతమైన సాహిత్య ప్రక్రియ ఉంది.
తెలుగు భాషలో ఉన్న సామెతలు మరే ఇతర భాషలో ఉండవని చెప్పడం అతియోశక్తి కాదు.
తెలుగు వారికి యతి ప్రాసలు,, అక్షర రమ్యత ప్రాణం.
పద రచనా సమయంలో నే కాక మామూలు వచోవిలాసం లో కూడా అనుప్రాస మైన అలంకారిక శైలి తెలుగువారికి ప్రాణం.
ఇవన్నీ కూడా తెలుగు భాషలో ఉన్నాయి.
తెలుగు సీమ ఆర్యభాషా కుటుంబానికి, చెందిన ఒరియా, మరాఠి మొదలైన ఉత్తర భాషల వ్యవహారిక ప్రాంతానికి ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన కన్నడం, తమిళం మొదలైన దక్షినాది వ్యవహారాల ప్రాంతానికి నట్టనడుమ నెలకొని ఉంది.
తెలుగు బాషపరిరక్షణ
*†****
తెలుగు బాషను మొట్టమొదటగా
మాతృ బాష తెలుగు అయిన మన
ఇండ్లలో తెలుగు మాత్రమే మాట్లాడాలి.
పిల్లలను ఆంగ్ల భాషలో చదివించినా మనం వారితో తెలుగుబాష లోనే మాట్లాడాలి.
ప్రతిరోజూ ఒక పేజీ తెలుగు భాషలో రాయడం అలవాటు చేయాలి.
తెలుగు కథల పుస్తకాలు,తెలుగు పేపర్లు వారి చేత చదివించాలి.
బజారులలో తెలుగు బోర్డుల పేర్లు చిన్నప్పటినుండే చదవడం అలవాటు చేయాలి.మధ్యమాలలో తెలుగు ఉండేలా చూడాలి
నాటకాలు నాటికలు, చతురసంభాషణలు, జానపద గీతాలు, చిందుగీతాలు మొదలైనవి చూసేట్టు , నేర్చుకునేట్టు చేయాలి.
తెలుగును కాపాడడం లో పత్రికల పాత్ర మరింత ఉన్నది.
సరిఅయిన తెలుగు పదాలతో ప్రకటించి ప్రజల్లోకి అందించాలి.
తెలుగు బాషను పరిరక్షించడంలో ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి.
చట్ట సభలలోనూ, ప్రజా పాలనా లోనూ మన మాతృ బాష అయిన తెలుగుకు
ప్రాధాన్యం ఇవ్వాలి అన్నీ కూడా తెలుగులోనే ఉండేట్టు చేయాలి.
ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలలు తెలుగుభాషలోనే ఉండేలా చేస్తూ
పదవ తరగతి వరకూ తప్పకుండ తెలుగు ఉండేట్టు చేయాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి