వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
35.లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమా (షోడశాక్షరీ)
36.స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయా (షోడశాక్షరీ)
ముప్పైఐదవ నామ మంత్రము -
ఓం స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయాయై నమః
వళిత్రయము = పొట్టపై కనిపిస్తున్న మూడు మడతలు.
భారమైన స్తనముల బరువు వలన, నడుము ఎప్పుడైనా విరుగుతుందేమో అని, నడుము చుట్టూ మూడు పట్టీలతో అనుగ్రహిస్తున్న, లోకాలనేలే పరమేశ్వరికి నమస్కారము.
చాలా సహజంగా యుక్తవయసు రాగానే ఎవరికైనా పొట్ట మీద మూడు మడతలు వస్తాయి. అమ్మవారి స్తనములు సూర్యచంద్రుల గమనం వలననే కదులుతున్న కాలాన్ని సూచిస్తాయి. అందుకనే పరమేశ్వరిని "కాలస్వరూపిణి" అన్నారు. తన రెండు భారమైన స్థానాల బరువు వలన అమ్మ నడుము ఎప్పుడైనా విరుగుతుందేమో అని, ఆ నడుము చుట్టూ చుట్టిన మూడువరసల బంగారు పట్టీ లాగా కనిపిస్తున్నయిట అమ్మ పొట్ట మీది మడతలు (వళిత్రయము). సహజ సౌందర్యాన్ని సొంతం చేసుకున్న పరమేశ్వరి, ఈ వళిత్రయము తో ఇంకా ఇనుమడించిన సౌందర్యంతో కనిపిస్తోంది, జగద్ధాత్రి. ఈ అందాన్ని చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయా" అని పిలవగానే, ఆ తల్లి పెదవుల పైన ఒక చిరునవ్వు మెరిసింది.
అమ్మ వారి నడుము చుట్టూ కనిపిస్తున్న మూడు మడతలును, "సత్వ, రజో, తమో" గుణములకు ప్రతీకలుగా; "మూర్తీభవించిన ముగురమ్మలు" - మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపాలుగా; త్రిమూర్తులు అయిన "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల" స్వరూపంగా; మూడు లోకాలకూ ప్రతీకగా మనం అన్వయం చేసుకోవచ్చు.
వశిన్యాది వాగ్దేవతలు అమ్మను వర్ణించేడప్పుడు, కన్యకామణి గా చూడట్లేదు. ఎందుకంటే, కన్నె వయసు స్త్రీకి, నడుముపైన లేదా పొట్టపైన ముడుతలు రావు. వీరు, జగన్మాతను బిడ్డలతల్లి అయిన ప్రౌఢగానే చూస్తున్నారు. బిడ్డలతల్లికి నడుము మీది మడతలు ఆమె తల్లి అనే విషయాన్ని గట్టిగా చెపుతాయి. తన పొట్ట, నడుము పైని ముడుతలను చూసుకున్న స్త్రీ కూడా, తన అమ్మతనాన్ని గుర్తుతెచ్చుకుని ఎంతో మురిసి ముద్ద అవుతుంది. ముగ్ధ అవుతుంది. మరి, కామేశ్వరి జగత్తుకంతటికీ తల్లి కదా. మరి ఆమె సంతును చూసుకుని ఎంత మురిసి పోతుందో కదా!
తన కటిభాగములో ఏర్పడ్డ వళిత్రయాన్ని కలిగిన లలితా పరాభట్టారికను పూజించేటప్పుడు
ఓం స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి