వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
43.కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా (ద్వదశాక్షరీ)
44.నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా (షోడశాక్షరీ)
నలభై నాల్గవ నామ మంత్రము -
ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః
చంద్రుని వలె కాంతులు విరజిమ్ముతూ, తనను నమ్ముకున్న భక్తతజనుల అజ్ఞానము అనే చీకటిని పారద్రోలే గోళ్ళు కలిగిన పరమేశ్వరి పాదాలకు నమస్కారం.
"తన్నులో నమ్మిన వేల్పుల మనమ్మున వుండెడి యమ్మ" అని పోతన కొలిచిన అమ్మ పాదాలకు, ముప్పది ముక్కోటి దేవతలు తమ తలను తాకించి నమస్కారము చెస్తారు. అంటే, మనం పూజించి, సేవించి, కొలిచే దేవతలు అందరూ కూడా, లలితా పరాభట్టారికను ఎంతో ప్రేమతో సేవించుకుంటారు. వారి తలలపై వున్న మరకత మణి మాణిక్యాలు, పగడాలు పొదగబడిన కిరీటాలు, అమ్మ పాదాలను తాకగానే, పాదాలకు వున్న గోళ్ళ కాంతులు వారి కిరీటాలపై పడటంవలన, ఆ కిరీటాలలో వున్న రత్న మణి మాణిక్యాలు వాటి కాంతిని కోల్పోయాయి. అంతటి శోభతో, కాంతితో నీ పాదాల గోళ్ళు, నీ భక్తులను అలరిస్తున్నాయి, పరాత్పరీ.
దేవలోకంలో, కామధేనువు, కల్పవృక్షం ఆ లోకంలో ఉన్న దేవతాసమూహానికి వారి కోరికలను తీరుస్తున్నాయి. కామధేనువు, కల్పవృక్షమూ దేవలోకానికే పరిమతయ్యాయి. కానీ, అమ్మా, అనంతమైన దివ్య కాంతులను వెదజల్లే నీ కాలి గోళ్లు, మూడు భువనాలలో నిన్ను ఆశ్రయించి వున్న, నీ వారిని అందరినీ అనుగ్రహిస్తున్నాయి. ఈ విధంగా, కామధేనువు, కల్పవృక్షమూ నీ ఆశ్రిత పక్షపాతం ముందు సరితూగవు, అని తెలుస్తోంది, జగన్మాతా!
అత్యంత ప్రకాశవంతమైన కాలి గోళ్ళ కాంతులతో, తన భక్తులను కటాక్షిస్తున్న పరమేశ్వరి పాదాలను, చూసిన వశిన్యాది వాగ్దేవతలు "నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా" అని కీర్తించారు. పరాత్పరి, చిరు దరహాసం చేసింది.
అందమైన, మెత్తటి ముంగాలుకు వున్న కాలి గోళ్ళతో మనలను అనుగ్రహిస్తున్న లలితా పరాభట్టారికను పూజించేటప్పుడు
ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి