వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
48.మహాలావణ్య శేవధిః (అష్టాక్షరీ)
49.సర్వారుణా (చతురాక్షరీ)
నలభై తొమ్మిదవ నామ మంత్రము -
ఓం సర్వారుణాయై నమః
ఆపాద మస్తకము ఎరుపు రంగులో ప్రకాశిస్తూ....ప్రకటితమైన పరమేశ్వరి ని చూచిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "సర్వారుణా" అని కీర్తించారు. అలా ఎర్రని ఎరుపురంగు లో వుండి తన భక్తులను ఆదరిస్తున్న జగన్మాత, లలితా పరాభట్టారికకు, నమస్కారము.
లలితా పరమేశ్వరి "సిదూరారుణ విగ్రహ" అని కూడా పిలువబడుతుంది. అమ్మ శరీరము సిందూర రంగులో "ఎర్రగా" ప్రకాశిస్తుంది. అమ్మ చేతిలోని కలువ, ఎరుపు. అమ్మ పంటి చిగురులు, ఎరుపు. అమ్మ ధరించే వస్త్రం, ఎరుపు. అమ్మ ధరించే, ముక్కు పుడక, చెవి పోగులు, హారాలు కూడా, పగడాలు మరియు కెంపులతో కలసి ఎర్రగానే ఉంటాయి. తన కొప్పులో ముడిచే పూవులు అన్నీ కూడా, ఎర్రని ఎరుపు రంగువే. రత్నాలతో పొదగబడిన పాత్రలో ఉంచిన అమ్మ పాదాలు కూడా ఎర్ర రంగులోనే దర్శనం ఇస్తున్నాయి. "ఉద్యద్భానుసహస్రాభ" అయిన అమ్మ సూర్యకిరణాల కాంతిలో ఎర్రగా ధగధగా మెరిసిపోతుంది. పరాత్పరి "చిదగ్నికుండ సంభూత" కనునక, అగ్నిభట్టారకుని అగ్నికీలల ఎర్రని రంగు జగన్మాతను ఆవరించి ఉండి, అమ్మ ఎర్రగా కనిపిస్తుంది.
అమ్మలో కనిపించే ఈ ఎర్రని రంగు, ఉదయం, సాయం సంధ్య లలో ప్రకృతి వర్ణాన్ని తెలియపరుస్తోంది. పరాత్పరి యొక్క ఈ ఎర్రని శరీర రంగు, అమ్మ లోని కరుణాంతరంగాన్ని కూడా ఆవిష్కరిస్తోంది.
పాదాల నుండి తలవరకూ ఎర్రని కుంకుమ రంగులో వుండి, నుదుటి మధ్యలో ఎర్రని కుంకుమ ధరించి, ఎర్రటి పెదాలతో చిరు నవ్వులు చిందిస్తూ....మనలను అను నిత్యమూ కాపాడుతూ, మన అర్హతలను బట్టి, కోరికలను తీర్చుతున్న, శ్రీచక్ర మధ్యవాసిని అయిన లలితా పరాభట్టారికను పూజించేటప్పుడు
ఓం సర్వారుణాయై నమః అని జపించాలి.*
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి