వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
49.సర్వారుణా (చతురాక్షరీ)
50.అనవద్యాంగా (పంచాక్షరీ)
యాభైయవ నామ మంత్రము -
ఓం అనవద్యాంగ్యై నమః
అనవద్య = నింద్యములు కాని / దోషములు లేని; అంగములు = శరీర భాగాలు
దోషము లేనివి, సాముద్రిక శాస్త్రానికే ప్రమాణములుగా చెప్పదగిన, ఏ విధమైన లోపాలు లేని, సుకుమారంగా, అందానాకి నిర్వచనంగా నిలిచే శరీర అవయవాలు కలిగి ఎంతో లావణ్యంతో విరాజిల్లుతున్న పరమేశ్వరికి నమస్కారము.
శరత్కాలంలో చంద్ర కాంతులు ఎంతో చల్లగా, ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాగే, చుదమామ కూడా అందంగా ఉంటుంది. కానీ, ఇంతటి సుఖాన్ని ప్రపంచానికి పంచే చంద్రునికి మచ్చ ఉంది. కానీ, పరాత్పరికి ఎటువంటి లోపము లేదు. ఆపాదించడానికి అవకాశం కూడా లేదు.
అమ్మ, "మహాలావణ్య శేవధిః" కదా! లావణ్యానికే అర్ధం చెప్పగలిగే అందాన్ని సొంతం చేసుకుంది పరమేశ్వరి. ఇంక, అమ్మ శరీర భాగాల నిర్మాణం లో లోపం ఎలా ఉంటుంది. శరీర భాగాలలో ఏవిధమైన లోపమూ కానరాని జగన్మాతను చూసిన వశిన్యాది వాగ్దేవతలు "అనవద్యాంగా" అని కొనియాడారు.
అమ్మని "సిందూరారుణ విగ్రహ" అని పిలుచుకుంటాము, కదా! పరాత్పరి, "సర్వారుణ" కూడా. శరీరమంతా ఎర్రని సిందూరపు పూతతో కప్పబడి, మొత్తం ఎర్రని రంగులో అందంగా కనుబడుతున్న జగన్మాత అంగములలో లోపం ఉండటం "అసహజం". చక్కని శరీర సౌష్టవముతో, అతి లావణ్యముతో, కామేశ్వరుని మనసు దొరకబుచ్చుకుని, త్రినేత్రుని ప్రేమ అనే మణిని సొంతం చేసుకుంది, అర్ధనారీశ్వరీ అయిన "అంబ". అందుకనే, పరాభట్టారికను "సర్వారుణా అనవద్యాంగా" అని కొలుచుకుందాము. ఈ నామంతో అమ్మవారిని స్త్రోత్రం చేస్తే, అయ్యవారు కూడా సంతోషపడి, భక్తుల అభీష్టాలను త్వరగా తీరుస్తాడట. తన మానసపీఠాన్ని అధిరోహించి, లోకాలను పాలిస్తున్న, తనదేవేరిని మనం కీర్తిస్తున్నాము, కదా! అందువలన.
*ఈ విధంగా, ఏ లోపమూ లేని, సర్వాంగ సుందరంగా, అనవద్యాంగ గా, సర్వారుణగా దర్శనం ఇస్తూ మనలను అను నిత్యమూ కాపాడుతూ, శ్రీచక్ర మధ్యవాసిని అయిన లలితా పరాభట్టారికను పూజించేటప్పుడు
ఓం అనవద్యాంగ్యై నమః అని జపించాలి.*
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి