వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
50.అనవద్యాంగా (పంచాక్షరీ)
51.సర్వాభరణ భూషితా (అష్టాక్షరీ)
యాభైయవ నామ మంత్రము -
ఓం సర్వాభరణ భూషితాయై నమః
ఆపాదమస్తకమూ, కాలి మట్టెల నుండి శిరమున వుండే చూడామణి వరకు ఎన్నో రకాలైన ఆభరణాలను ధరించి ఉన్న పరమేశ్వరికి నమస్కారము.
చంద్రునికి సంబంధించిన ముత్యము, కుజుడికి సంబంధించిన పగడము, శుక్రునికి సంబంధించిన వజ్రము మొదలైన విలువైన రత్న మాణిక్యాలు పొదగబడిన అనేకరకాల ఆభరణాలను ధరించి దర్శనమిచ్చిన అమ్మవారిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు, శ్రీలలితా పరాభట్టారికను "సర్వాభరణ భూషితా" అని కీర్తించారు.
అమ్మ "సర్వాభరణ భూషిత". "కాళికా పురాణం"లో తలమీది కిరీటం నుండి, కాలి మెట్టెల వరకు స్త్రీలు ధరించే ఆభరణాలు అన్నీ వర్ణించబడ్డాయి. ముదితలు, స్త్రీలు ధరించే 40 రకాల ఆభరణాలను వివరించి చెప్పారు. వీటిలో కొన్ని సౌభాగ్యానికి సూచికలు. మిగిలినవి, సౌందర్యాన్ని వృద్ధి చేసేవి. మంగళసూత్రం, నల్లపూసల గొలుసు, చెవుల కమ్మలు, ముక్కెర, కాలి మట్టెలు --- ఇవి ధరించిన స్త్రీని వివాహిత మరియు ముత్తైదువగా గుర్తిస్తారు, సమాజం లో. చంద్ర హారాలు, పాపిడి బొట్టు మొదలైనవి సౌందర్యాన్ని ఇనుమడింప జెసేవి.
పూర్వము సంపున్నులైన స్త్రీలు ధరించే ఏడు వారాల నగలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. గొప్పగా చెప్పుకునే వారు. పరమేశ్వరి ఆవిర్భావ సమయంలో సకల దేవతల అంశలవలన అంగములు ఏర్పడ్డాయి. ఆ సకల దేవతల శక్తులు అమ్మకు, దివ్య అస్త్రాలుగా యిచ్చారు. అమ్మ, దేవతలనుండి కేవలము అస్త్రాలనే కాకుండా, వారు ధరించిన వివిధములైన ఆభరణాలను కూడా వారినుండి పొందింది. ఇలా దేవతలనుండీ వచ్చిన అస్త్రాలనూ, ఆభరణాలను ధరించి, రాక్షసుల సంహారం చెయడానికి కూడా, ఒక శుభ కార్యానికి వెడుతున్నట్టుగా, వారితో యుద్ధానికి వెళ్ళేది, సర్వమంగళ.
సర్వపాప హరి, స్వర్గద్వారకపాటపాటనకరీ అయి, శ్రీచక్ర మధ్యవాసిని అయిన లలితా పరాభట్టారికను పూజించేటప్పుడు
ఓం సర్వాభరణ భూషితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి