సముద్రగుప్తుడు 8 : - ! అచ్యుతుని రాజ్యశ్రీ

 హరిషేణుడిలా జవాబిచ్చాడు" ప్రభూ! దీని వెనుక ఓపెద్దకథ ఉంది.మీతండ్రి చంద్రగుప్తులవారు లిచ్ఛవీరాకుమారి కుమార దేవిని పెళ్లాడారు.రాజకీయ కారణాల వల్ల చంద్రావతిని పెళ్లి చేసుకున్నారు.ఆమెకు కాచుడు జన్మించాడు. మూడేళ్ల తర్వాత కుమార దేవికి మీరుపుట్టారు.అప్పటికే ఆమె పట్టపురాణి.ఇక మీపెళ్లి శ్రీదత్తాదేవితో జరగడంతో లిచ్ఛవుల ప్రభావం రాజదర్బార్ లో పెరగటంతో,పెద్ద కొడుకు కాచుడు యువరాజు కాలేదు.అందుకే అతని తల్లితరుఫువారు  నాగరాజులు కాచుని సింహాసనం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు." "హరీ! ఇప్పటికే నాగవంశంలో పద్మావత్, రోహిల్ ఖండ్ అనే రాజ్యాలున్నాయి కదా? ఇంకా ఎందుకు దురాశ?" "ప్రభూ!మగధలో బొగ్గు ఇతర ఖనిజాలగనులున్నాయి. అలాంటివి ఆరెండు రాజ్యాల్లో లేవు.మంచి కలపచెట్లుకూడా లేవు.అందుకే అసూయ దుగ్ధ"
"హరీ! నేను కాచుడు ఒకేచోట అన్న దమ్ముల్లా పెరిగాం.ఏంచేసేది?""ప్రభూ! కురుక్షేత్రంలో అర్జునుడిలాగా మాట్లాడకండి. శత్రువు నించి రాజ్యాన్ని కాపాడటం మీవిధి ధర్మం!మీతండ్రి నమ్మకంతో ఆభారాన్ని మీపై మోపిన విషయం గుర్తుంచుకోండి"."సరే,సేనాపతి పృథ్వీషేణునికి కబురంపు." చిత్తంప్రభూ"
చేతిలో వీణతో వచ్చిన భార్య తో అన్నాడు"శ్రీ దత్తా! రాజ్య రక్షణ భారం నాపై ఉంది.స్థిమిత పడేదాకా వీణను తాకను"
సేనాని పృథ్వీషేణుడికి పురమాయించాడు" విక్రమదేవరాజుకి కబురంపు యుద్ధంకి సిద్ధంగా ఉండాలని.అయోధ్య కన్యాకుబ్జ( నేటి కనౌజ్ యు.పి) దగ్గర శత్రువులని అడ్డగిద్దాం  " "చిత్తం ప్రభూ!"  తల్లి కుమారదేవి 
సముద్ర గుప్తుని నుదుట వీరతిలకం దిద్దింది. చంద్ర గుప్తుడు కొడుకువైపు గర్వంగా చూస్తూ"పృథ్వీషేణుడు మంచి అనుభవం పరాక్రమం ఉన్న సేనాపతి. అడుగడుగునా అతని సలహా తీసుకో.ఆర్యావర్తం అంతా అతనికి కొట్టిన పిండి.రహస్య మార్గాలన్నీ కరతలామలకం" అన్నాడు.🌹
కామెంట్‌లు