నిర్మలమైన ఆకాశంలా
మనసునిష్కల్మషంగా ఉంటే..?
అడుగడుగునా
అఖండ విజయాలబాటలే...
ఆత్మీయతతో
అభినందించే హృదయం..
అమృతధారలు
కురిపించే అభయహస్తం...
మనిషిని మనీషిగా మార్చే
మహోన్నత ఆయుధాలు..!
కానీ...
కన్నుల్లో అసూయ నిండితే
బ్రతుకంతా అంధకారమే..!
మనసులో మత్సరముంటే
ఆనందం ఆమడ దూరమే..!
బంధాలు భారమై...
బాంధవ్యాలు దూరమైతే...
అడుగడుగునా అపార్థాలే
అవమానాల సుడిగుండాలే...
అందుకే...
ద్వేషాన్ని వీడి
పదిమందికి
ప్రేమను పంచుదాం
ఆనందాన్ని అన్వేషిస్తూ
ప్రగతి పథాన పయనిద్దాం..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి