గుంట నక్కలు ముసుగేసుకుని మనచుట్టు తిరుగుతు మాయ మాటలుచెప్పి నిన్ను మాయం చేస్తారు జాగ్రత్తమహిళా..!మహిళ చిరునవ్వుల చాటునకన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు...!బడికి వెళ్లే ఆడ పిల్లపై నీ వెయ్యికన్నులు వేసి ఉంచు మహిళా..!రెప్పపాటు ఆదమరచినావోడేగ లాగా తన్నుకొని పోతారు జాగ్రత్తమహిళా..!మహిళ చిరునవ్వుల చాటునకన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు...!పొలం పనుల కోసం పొయ్యేటప్పుడుబుడ్డదాన్ని వెంట తీసుకునిపో...మరచి పోయినావో కామాంధులకాటుకు బలై పోతుంది జాగ్రత్తమహిళా..!మహిళ చిరునవ్వుల చాటునకన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు...!కూలి నాలికి పొయ్యేటప్పుడు చీడపురుగుల బారిన పడకుండానిండు వస్త్రధారణతో వెళ్లు...మరచి పోయినావో చుట్టు ముట్టిచిత్రవధ చేస్తారు జాగ్రత్త మహిళా..!మహిళ చిరునవ్వుల చాటునకన్నీటి చుక్కలు ఎవరికి తెలుసు...!అంతా నావాళ్ళే అని గుడ్డిగా నమ్మకుమహిళా..!నీ వెనక గోతులు తీసేది నీ వాళ్ళే అనితెలుసుకో మహిళా..!మహిళ చిరునవ్వుల చాటునకన్నీటి చుక్కలు ఎవరికి తెలుసు...!సమాజంలో ఉన్న కొంత మందిగురించి మాత్రమే వారు మంచిగామారుతారు అని ఆశిస్తు...తరలిపో తరలిపో..చీకటి నుంచి వెలుగుకు తరలిపో..కుందేలువి కావు.. పులిలా మారిపో..వెంటాడే ఒడిదుడుకుల మృగాలతో యుద్ధానికి తరలిపో...’’ ఓ మహిళా మీకివే మా వందనాలు.కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’కి వందనాలు============================================మంజుల పత్తిపాటి (కవయిత్రి).; - చరవాణి 9347042218.ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణ రాష్ట్రం
జాగ్రత్త మహిళా..!: - మంజుల పత్తిపాటి (కవయిత్రి).; - చరవాణి 9347042218.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి