1.
అమ్మ పాల పెరిగాడు ,
ఆరోగ్య మహాభాగ్యవంతుడు!
అమ్మ అక్షరాలు దిద్దినాడు, జీవన జ్ఞాన సిద్ధుడు!
అమ్మ భాష ప్రాథమిక, విద్యాభ్యాస ప్రథమ గురుడు!
మాతృభాష సమర్థుడే, అన్యభాషాజ్ఞానవిజయుడు!
అమ్మ భాషలో బోధన,
అలవోక విషయ సాధన, పివిఎల్!
2.
బంగ్లాదేశీయుల,
మాతృభాషోద్యమ,
విజయోత్సవము!
అంతర్జాతీయ మాతృభాష, దినోత్సవ సాంప్రదాయము!
విశ్వమంతా మాతృభాషల, పరిరక్షణే ఆశయము!
మాతృభాషా వికాసం ,
మానవ సంస్కృతి సంరక్షణము!
భాష కనుమరుగు, మనిషి,
ఉనికి తెరమరుగు పివిఎల్!
3.
మన భాష తెలుగు,
బతుకు వెలుగు ఆరనివ్వకు!
విను ,అను ,చదువు, వ్రాసి ,
మను, తెలుగు మరవకు!
రక్షణ, పోషణ, శిక్షణ ,
పర్యవేక్షణ-వదలకు!
మాతృభాషే అమ్మ ,
మన మనుగడ చివరి వరకు!
తెలుగంటే తేనె పట్టు ,
మధురం అధరం ప్రతిబొట్టు,
పివిఎల్!
__________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి