కనపడే దేవుడు.:- డా పివిఎల్ సుబ్బారావు, విజయనగరం 9441058797.
1.
నాస్తికులైనా కశ్యపాత్మజుడు, సూర్యుడు లేడన లేరే! 

చూసేవాళ్ళకి నిత్యం,
 కళ్ళేదుట కనపడతాడే! 

ఎవరు తలుపు తెరిస్తే, 
వారి ఇంటి లోపలకు వస్తాడే! 

స్పర్శతో పలకరిస్తాడే,
 ఇల్లంతా కాంతి ప్రసరిస్తాడే! 

ప్రియమార, అపార ,
ఆరోగ్య, సౌభాగ్యం కనికరిస్తాడే! 
2.
ద్వాదశ నామాలు-మిత్రాయ,
రవయే,సూర్యాయ, భానవే! 

ఖగాయ, పూష్ణీ ,
హిరణ్యగర్భాయ, మరిచయే!

ఆదిత్యాయ, సవిత్రే,
  అరుణాయ, భాస్కరాయ!

ఓం తో ప్రారంభించు నమఃతో, ముగించు, ధ్యానించు!

ఆదివారం అర్ఘ్యాన జపించు, ఆరోగ్యసిరి లభించు!

సూర్యనమస్కారాల ఉచ్చరించు, దేహం మనసు దృఢమై జీవించు!
3.
రథసప్తమి సూర్య జయంతి,   
               పౌరాణిక కథనం! 

ఉత్తరాయణం దిశగా,
           సూర్యరథ గమనం! 

శీతాకాలం ముగిసి,
 వేసవి, వసంతం ప్రారంభం! 

ఆర్కస్నానం పుణ్యం,
 ఆరాధనం, దానం అమితఫలం!

శ్రీకృష్ణసుతుడు శంభు,
 కుష్టు వ్యాధి విముక్తి దినం! 
4.
జగదానందకారకుడు,   
                    భాస్కరుడు !

జన ఆరోగ్య పోషకుడు,
                      ఆదిత్యుడు!

 వేద పారాయణుడు ,
          హనుమ బోధకుడు! 

సూర్యనారాయణుడు,    
              లోకబాంధవుడు!

 సౌరశక్తి తరగని,
     ఇంధన వనరుడతడు!
5.
భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచ, మూలం సూర్యతేజం! 

సూర్య స్తోత్రాలు ఆరోగ్యం, ఆదిత్య హృదయం విజయం! 

సూర్యగ్రహణ సమయం,    మంత్రమననం,ధ్యానఉద్దీపనం! 

సూర్యతేజపరివర్తనం,
         చంద్రుని శీతల ప్రకాశం!
_________


కామెంట్‌లు