ఫిబ్రవరి 14 ,ప్రేమికుల దినోత్సవం, శుభాకాంక్షతో!
1.
ప్రేమ ఒక్క దినమేమి!
ప్రేమ జీవన కలిమి!
ప్రేమ మానవ బలిమి !
ప్రేమ వీడని చెలిమి!
ప్రేమ మాయని మేలిమి!
2.
ప్రేమ మూగ భాష!
ప్రేమ హృదయ ఘోష!
ప్రేమ నిత్య నికష!
ప్రేమ ప్రధమ పురుష!
ప్రేమ నిత్య ప్రత్యూష!
3.
ప్రేమ మొదటి లుక్!
ప్రేమకేది సాటిలక్!
ప్రేమ మరి దిగని కిక్
ప్రేమ బైక్ లేదు బ్రేక్ !
ప్రేమకు లేదు ఎనీ చెక్!
4.
ప్రేమ రింగ్ టోన్, ఏజ్ ప్రోన్!
ప్రేమే వన్స్ మోర్, నో,నో మోర్!
ప్రేమ సాఫ్ట్ వేర్,తెలీదు హార్డ్ వేర్!
ప్రేమ ఫెయిర్ కాకుంటే ఫైర్ !
ప్రేమ రామ, అది ఎవ్విర్ వేర్!
5.
ప్రేమికులే మరణించేది!
ప్రేమ జీవిస్తుంది !
ప్రేమ గెలుస్తుంది!
ప్రేమ శాసిస్తుంది!
ప్రేమభాసిస్తుంది!
ప్రేమ పరిమళిస్తుంది!
_________
ప్రేమ!: - డా పివిఎల్ సుబ్బారావు విజయనగరం 9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి