నేను.: - డా పివిఎల్ సుబ్బారావు.-విజయనగరం.-9441058797

 మహాశివరాత్రి    శుభాకాంక్షలతో-----
             
1.
నేను చిదానంద రూపాన్ని, శివుడిని, శివుడిని, 
నిర్వికల్పుడను నిరాకారుడను, 
అన్నింటా సమంగా ఉన్నాను, 
సర్వేంద్రియాలు,
 వికసింప చేస్తున్నాను!
2 నాకు లేరు-
    
     తల్లిదండ్రులు,
     
     బంధుమిత్రులు,
       
      గురు శిష్యులు! 
3. నేను కాను-
       కీలకమైన ప్రాణం,
      భోజనం, భోజ్యం, భోక్తా!
4. నాకు లేనివి--
 
       జనన మరణాలు,
 
       జాతి భేదాలు ,
      బంధమోక్షాలు,
     షడ్వివికారాలు ,
     మంత్రాలు,
 
     తీర్ధాలు ,
     వేదాలు ,
    యజ్ఞాలు!
5. నేను కానివి,--
 
       పంచభూతాలు, 
       పంచేంద్రియాలు ,
       పంచవాయువులు,
 
       పంచ కోశాలు,
       కర్మేంద్రియాలు,
       సప్త ధాతువులు,
 
       అంతఃకరణ చతుష్టయం!
6.
    నేను చిదానంద రూపాన్ని ,
           శివుడిని, శివుడిని !
   నేను చిదానంద రూపాన్ని,   
           శివుడిని ,శివుడిని!
__________
ఆది శంకరుల విరచిత,
 నిర్వాణ షట్కం ఆధారంగా.

===============================
కామెంట్‌లు