ఛత్రపతి: - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)- సారవకోట-చరవాణి: 9490904976
 భారతజాతి పరపతి, ప్రజాపతి..
మొఘలులను ఎదురించి మట్టుపెట్టిన మరాఠా సామ్రాజ్యాధిపతి..
దేశం కోసం, ధర్మం కోసం నిలిచిన ధీరోద్ధాతులు.
భరతమాత ఘన సుతులు..
ప్రత్యర్ధులపై పరాక్రమంతో ప్రఖ్యాతి..
వర్ణించగలమా మీ ఖ్యాతి..
దురాక్రమణదారులపై చూపారు దమననీతి.
శివాజీ ఎందులోనూ ఎవరితోనూ పడలేదెన్నడూ రాజీ..
హర హర మహాదేవ నామ స్మరణతో
రణరంగంలో శత్రువులపై లయకారుడువై 
హడలెత్తించి హతాశులు చేసిన శివుడువు వీర శివాజీవి.
ప్రజల ప్రభూజీ శివాజీ..

కామెంట్‌లు