ఉబుసుపోక (చైతన్య స్రవంతిలో): - అంకాల సోమయ్య-దేవరుప్పుల -జనగామ-9640748497
ప్రకృతి మనిషికన్నీ 
ఇచ్చింది 
కానీ 
మనిషే ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు

అన్నదాతలను
దోపిడి చేస్తున్నదీ రాజ్యం 
అన్నదానమే
తాను చేస్తున్న పాపమా!?

మనిషిని మనిషిగా చూడం
మా రాజకీయ లబ్ధి కోసం 
కులం ,మతం ,ప్రాంతం ,వర్ణం, వర్గం మధ్య చిచ్చు బెట్టి
మా మైలేజీ పెంచుకుంటాం 
మేము ఊసరవెల్లిని మించిన రంగులు మార్చేవాళ్ళం

చరిత్ర మాకవసరంలేదు
గతంగతః 
ప్రస్తుతేనమః 
భవిష్యత్తు ప్రశ్నార్థకమే?!
మేము స్వార్థచింతనపరులం
ఎవరినైనా ఏమార్చుతాం
స్వలాభం కోసం 
ఎన్ని అడ్డదారులైన త్రొక్కుతాం

అశోకుడు యుద్ధానంతరం 
శాంతికాముకుడయ్యాడు
మేము కానేకాము 
మేము రగులుకునే నివురు కప్పిన నిప్పులం
సమయం చూసి జ్వలిస్తాం

భారతదేశం జగత్తుకు
శాంతి సందేశమిచ్చినదై
ఏంతెచ్చిపెట్టింది 
ఒక నోబెల్ బహుమతికైన
అర్హత సాధించలేదు!?
మన తల్లి అన్నపూర్ణ 
మన అన్న దానకర్ణ
మన కీర్తి మంచుకొండ అన్నచందమే కదా!?


కామెంట్‌లు