తెలుగు వెలుగులు: - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497
అమ్మ పలికిన తొలి పలుకు తెలుగు 
నా వీనులకు సుస్వర సంగీతమై,
నాన్న నేర్పిన తొలి పదంతెలుగు
నా నడకకు దారిచూపిన దీపమై…


స్వచ్ఛమైన పాల నురగతెలుగు
పసిపాపలబోసినవ్వుతెలుగు
తీపిపద సుగంధమే నా తెలుగు,
పల్లె పలుకుబడుల్లో పరిమళించిన
ప్రజావాహిని జీవద్భాషే నా తెలుగు.


తొలి తెలుగు రామకథ
రంగనాథ రామాయణమే 
నా తెలుగు 
ఆధునిక సాహితీప్రక్రియలకు 
పాదైనదీ నా తెలుగు 
పాశ్చాత్య పోకడలు ఎన్నిపొడజూపిన 
ఆంగ్లమే నా తెలుగును మ్రింగచూసిన
మకుటాయమానమై నిలిచింది 
 నా తెలుగు.

పరభాష మోజంతా ఉపాధి కోసమై
స్వభాష బ్రతకాలి సంభాషణీయమై
మసక బారకుండ కాపాడుకోవాలి
మన మాతృభాష యాసతో
హృదయోల్లాసమై వెయ్యేండ్లు వెలగాలి మన భాషా దీపం
బడిలోన బడిబయట
మనరచనావ్యాసంగాలలో
పతాకస్థాయిలో నిలవాలి 
శోభాయమానమై
తరతరాలుగ్రోలాలి మనతెలుగు భాషామధువులు
శోధనపరిశోధన రాజమైమనభాష
పరిమళం జగత్తంత పరివ్యాప్తమవ్వాలి

అమ్మ భాష నిలవాలి
ఆరని జ్యోతియై
నా తెలుగు ఘనకీర్తి 
దిగంతాలను తాకాలి
దేశ భాషలందు తెలుగు లెస్స 
చేయోద్దు నీభాషలెస్సు 
నిత్యం వెలుగులు నింపే తల్లి.
నాతెలుగుతల్లి నావెలుగు తల్లి


కామెంట్‌లు